Devara : దేవర ప్రీ రిలీజ్ రద్దు వల్ల ఎంత నష్టం వాటిల్లిందో తెలుసా..?
Devara : వేడుక రద్దయిందని తెలిసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. కుర్చీలు విరగొట్టి నానా రభస చేసారు. వీటితో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణంలో అనేకమైన వస్తువులను డ్యామేజ్ చేసారు
- By Sudheer Published Date - 07:35 PM, Mon - 23 September 24

Devara Pre-Release : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ (Devara) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Devara Pre Release Event) రద్దు కావడం తో అభిమానులు తీవ్ర నిరాశకు గురి కావడమే కాదు.. మేకర్స్ సైతం నిరాశ వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ అయితే స్వయంగా ఓ వీడియో రిలీజ్ చేసి తాను ఎంతో బాధపడుతున్నట్లు తెలిపాడు. ఇక ఈవెంట్ ను చూడాలని , ఎన్టీఆర్ మాటలను వినాలని , సినిమా విశేషాలను తెలుసుకోవాలని తెలుగు రాష్ట్రాల నుండే కాదు ఇతర రాష్ట్రాలనుండి కూడా పెద్ద ఎత్తున అభిమానులు నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. ఉదయం నుండి హైదరాబాద్ నోవాటెల్ ముందు పడిగాపులు కావడం మొదలుపెట్టారు. వందలు కాదు వేల సంఖ్యలో అభిమానులు చేరుకోవడం తో చివరి నిమిషంలో ఈవెంట్ నిర్వాహకులు సెక్యూరిటీ రీజన్స్ తో రద్దు చేసారు.
ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుండి విడుదల అవుతున్న సోలో చిత్రం, కాబట్టి అభిమానులు భారీ సంఖ్యలో హాజరు అవుతారని ముందుగానే ఊహించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఓపెన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో అందరూ శిల్ప కళా వేదికలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తారని అనుకున్నారు. కానీ మేకర్స్ అనూహ్యంగా హోటల్ నోవొటెల్ లో ఏర్పాటు చేసారు. అందువల్ల సెక్యూరిటీ కారణాల చేత ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేయాల్సి వచ్చింది. వేడుక రద్దయిందని తెలిసి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. కుర్చీలు విరగొట్టి నానా రభస చేసారు. వీటితో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణంలో అనేకమైన వస్తువులను డ్యామేజ్ చేసారు. అలాగే నిర్మాతలకు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా దాదాపుగా 3 కోట్ల రూపాయిల నష్టం వాటిలినట్టు తెలుస్తుంది. 3 కోట్ల రూపాయిల నష్టం అంటే చిన్న విషయం కాదు. చిన్న సినిమాలు మూడు చేయొచ్చు. ప్రస్తుతం సినిమా హిట్ అయ్యితే పెద్ద ఎత్తున సక్సెస్ మీట్ చేయాలని నిర్మాతలు చూస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూద్దాం.
Read Also : Monkeypox : మంకీపాక్స్.. భారత్‌లో మూడో కేసు నమోదు