Jr NTR Injury : జూ.ఎన్టీఆర్ ఎలా గాయపడ్డారో తెలుసా?
Jr NTR Injury : షూటింగ్ సెట్లో చీకటి ఎక్కువగా ఉండటంతో స్టేజీ ఎడ్జ్ కనిపించకపోవడం వల్ల తారక్ జారి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయనకు పక్కటెముకలు మరియు చేతికి స్వల్ప గాయాలు అయినట్లు ప్రాథమికంగా తెలిసింది
- Author : Sudheer
Date : 19-09-2025 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఒక ప్రైవేట్ యాడ్ షూట్ (Private Ad shoot) చేస్తుండగా గాయపడిన విషయం సినీ వర్గాల్లో కలకలం రేపింది. అందుతున్న సమాచారం ప్రకారం.. షూటింగ్ సెట్లో చీకటి ఎక్కువగా ఉండటంతో స్టేజీ ఎడ్జ్ కనిపించకపోవడం వల్ల తారక్ జారి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయనకు పక్కటెముకలు మరియు చేతికి స్వల్ప గాయాలు అయినట్లు ప్రాథమికంగా తెలిసింది. తారక్ గాయపడిన వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు.
Big Shock to YCP : టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు?
ఈ ఘటన అనంతరం ఎన్టీఆర్‌ను వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులకు చూపించినట్లు సమాచారం. వైద్యులు ఆయనను పరీక్షించి ఎలాంటి తీవ్రమైన గాయాలు లేవని, కేవలం స్వల్ప గాయాలేనని స్పష్టం చేశారు. అందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం తారక్ ఆరోగ్య పరిస్థితి స్ధిరంగా ఉండటంతో చికిత్స అనంతరం ఆయనను ఇంటికి తీసుకువెళ్లారని తెలిసింది. ఇది అభిమానులకు కొంత ఊరటనిచ్చింది.
సినీ ఇండస్ట్రీలో షూటింగ్ సమయంలో ఇలాంటి చిన్న ప్రమాదాలు జరగడం సహజమేనని నిపుణులు అంటున్నారు. అయితే స్టార్ హీరోల విషయంలో అలాంటి వార్తలు వెలువడితే అభిమానుల్లో ఆందోళన ఎక్కువ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకుని తన సాధారణ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ఆరోగ్యం త్వరగా కోలుకోవడం అత్యంత అవసరమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.