Dlquer Salman Lucky Bhaskar : దుల్కర్ సినిమా సైలెంట్ గా ముందుకు తెచ్చారు..!
దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్షన్ లో వస్తున్న సినిమా లక్కీ భాస్కర్ (Lucky Bhaksar Movie). ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ మూవీస్
- By Ramesh Published Date - 04:00 PM, Wed - 10 July 24

మలయాళ హీరోనే అయినా తెలుగులో మంచి మార్కెట్ సంపాదించాడు దుల్కర్ సల్మాన్. తెలుగు సినిమాల్లో నటించడం వల్ల అతనికి సౌత్ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా సూపర్ పాపులారిటీ వస్తుంది. ఇప్పటికే మాహనటి, సీతారామం రీసెంట్ గా కల్కి లో గెస్ట్ రోల్ చేశాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman). అంతేకాదు తెలుగులో ఎలాంటి సినిమా అయినా చేసేందుకు రెడీ అంటున్నాడు.
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్షన్ లో వస్తున్న సినిమా లక్కీ భాస్కర్ (Lucky Bhaksar Movie). ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ మూవీస్ నిర్మిస్తున్నారు. 1990 కాలం నాటి బ్యాంక్ ఎంప్లాయ్ కథతో ఈ సినిమా వస్తుంది. సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమాను ముందు సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 7న రిలీజ్ అంటూ పోస్టర్స్ వేశారు. సెప్టెంబర్ 27న ఎన్.టి.ఆర్ దేవర వస్తుంది. అందుకే ఆ సినిమాకు పోటీ ఎందుకు అనే ఆలోచనతో దుల్కర్ లక్కీ భాస్కర్ ని నెల మొదటి వారం లోనే రిలీజ్ చేస్తున్నారు. లక్కీ భాస్కర్ టీజర్ సినిమాపై ఆసక్తి పెంచింది.
తప్పకుండా దుల్కర్ ఈ సినిమాతో కూడా తెలుగులో మరో సూపర్ హిట్ అందుకున్మే అవకాశాలు కనీప్స్తున్నాయి. దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ సినిమా కూడా వైజయంతి బ్యానర్ లో ఉంటుందని టాక్. కల్కి సినిమాలో అతిథి పాత్ర చేసిన దుల్కర్ తో నెక్స్ట్ భారీ సినిమానే ప్లాన్ చేస్తున్నారట వైజయంతి నిర్మాతలు.
చూస్తుంటే దుల్కర్ సల్మాన్ మలయాళం వదిలి పూర్తిగా తెలుగు సినిమాల మీద దృష్టి పెట్టేలా ఉన్నాడు. ఏది ఏమైనా దుల్కర్ కి తెలుగు లో మంచి ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలానే అక్కడ ఇక్కడ సినిమాలు చేస్తూ తన పాపులారిటీ పెంచుకోవాలని ఫిక్స్ అయ్యాడు దుల్కర్ సల్మాన్.