Siddu Jonnalagadda : తెలంగాణ సర్కార్ కు రూ.15 లక్షల విరాళం అందించిన డీజే టిల్లు
Siddu Jonnalagadda : కొద్దీ రోజుల క్రితం తెలంగాణ లో పెద్ద ఎత్తున భారీ వర్షాలు , వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందించారు
- By Sudheer Published Date - 07:48 PM, Sun - 8 December 24

తెలుగు సినీ పరిశ్రమలో యూత్ ఫుల్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సమాజ సేవలో కూడా ముందుంటున్నాడు. కొద్దీ రోజుల క్రితం తెలంగాణ (Telangana) లో పెద్ద ఎత్తున భారీ వర్షాలు , వరదలు (Heavy rains and floods) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో సినీ ప్రముఖులు తమ వంతు సాయం అందించారు. వీరిలో సిద్దు కూడా ఒకరు. తన వంతు సాయంగా రూ.15 లక్షలు ప్రకటించారు. ఈరోజు ఆ చెక్ నుతన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.15 లక్షల విరాళం అందించాడు.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధును ప్రత్యేకంగా అభినందించారు. సినీ తారలు ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల్లో పాల్గొనడం సమాజానికి మంచి సందేశం ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమం పట్ల తమ బాధ్యతను చాటుకుంటూ ముందుకు రావడంపై సీఎం సిద్ధును, ఆయన తండ్రిని ప్రశంసించారు. సీఎంను కలిసిన వారిలో సిద్ధుతో పాటు డాక్టర్ సి.రోహిణ్ రెడ్డి, మహేంద్ర, నిర్మాత కాశి కొండలు కూడా ఉన్నారు. ఈ సందర్బంగా వీరందరినీ సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు.
Read Also : Air Show : ట్యాంక్ బండ్‌పై ముగిసిన ఎయిర్ షో.. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు