Diwali : దీపావళికి సినీ సందడి మాములుగా లేదు..రికార్డ్స్ బ్రేక్ చేయాల్సిందే ఫ్యాన్సే
Diwali : మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇలా అగ్ర హీరోల చిత్రాల నుండే కాక చిన్న చిత్రాల నుండి కూడా వరుస అప్డేట్స్ రాబోతున్నాయి
- By Sudheer Published Date - 09:07 PM, Tue - 15 October 24

గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ (Tollywood Box Office) వద్ద పెద్దగా సినీ సందడి కరువైంది. కేవలం కల్కి , దేవర తప్ప పెద్ద హీరోల సినిమాలే లేవు..ఇదే తరుణంలో పలు చిన్న చిత్రాలు వచ్చి అలరించాయి కానీ అభిమానుల అంచనాలకు తగ్గ సినిమాలు రాలేదు. ఇక దసరా కూడా సంపగానే అయిపోయింది. కేవలం వెండితెరపైనే కాదు సోషల్ మీడియా లో కూడా సినిమా సందడి లేకుండా పోయింది. అగ్ర హీరోలు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ..ఆ సినిమా తాలూకా అప్డేట్స్ ఏవి కూడా షేర్ చేస్తుండకపోయేసరికి అభిమానులు నిరాశలో ఉన్నారు. వీరి నిరాశకు తెరదించేందుకు సిద్ధం అవుతున్నారు మేకర్స్.
దీపావళి (Diwali)కి ఒకటి రెండు కాదు అంతకు మించి అప్డేట్స్ రాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇలా అగ్ర హీరోల చిత్రాల నుండే కాక చిన్న చిత్రాల నుండి కూడా వరుస అప్డేట్స్ రాబోతున్నాయి. దీపావళి కానుకగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి టీజర్ , ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి ఒక పాట, నందమూరి బాలకృష్ణ ‘ఎన్బికే 109’ నుండి టైటిల్ తో పాటు టీజర్ , రెబెల్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమా వీడియో కంటెంట్ రాబోతున్నాయి. ఇవే కాక మరిన్నో అప్డేట్స్ రాబోతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెపుతున్నారు. మరి వాటిలో ఏది బాగా పేలుతుందో..? ఏది రికార్డ్స్ వ్యూస్ రాబడుతుందో..? అనేది చూడాలి.
Read Also : Breast Cancer : రొమ్ము క్యాన్సర్ గుర్తించదగిన లక్షణాలు లేకుండా కూడా ఇది సంభవిస్తుంది..!