పాన్ ఇండియా బాటలో మరో మూవీ!
సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రాబోతోన్న మైఖెల్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోంది.
- By Balu J Published Date - 03:56 PM, Sat - 18 December 21
సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రాబోతోన్న మైఖెల్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్టైన్ చిత్రాన్ని రంజిత్ జయకోడి తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలోని ప్రతీ పాత్రకు ఓ ప్రాముఖ్యత ఉంది. స్టార్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి, ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటించిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.
తాజాగా మేకర్లు ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను రివీల్ చేశారు. మజిలి సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న దివ్యాంక కౌశిక్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం దివ్యాంక కౌశిక్‌ను దర్శకనిర్మాతలు తీసుకున్నారు. సందీప్ కిషన్ పాత్ర ఎంతో ఇంటెన్సిటీతో ఉండబోతోంది. రజింత్ జయకోడి ఈ చిత్రానికి విభిన్నమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. నటీనటులకు ఈ చిత్రం స్పెషల్‌గా నిలిచిపోనుంది. నారాయణ్ దాస్ కే నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కుర్ రామ్ మోహన్ రావు కలిసి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్ర నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
సాంకేతిక బృందం
దర్శకత్వం : రంజిత్ జయకోడి
నిర్మాతలు : భరత్ చౌదరి, పుస్కర్ రామ్ మోహన్ రావు
సమర్పణ : నారాయణ్ దాస్ కే నారంగ్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శివ చెర్రీ
పీఆర్వో : వంశీ-శేఖర్
Related News
Pushpa Raj : సోలోగానే పుష్ప రాజ్.. ఆ సాహసం ఎవరు చెయ్యట్లేదు..!
Pushpa Raj స్టార్ సినిమాలు రిలీజ్ డేట్ క్లాషెస్ గురించి తెలిసిందే. సినిమా అనౌన్స్ మెంట్ రోజే ఫలానా డేట్ అని రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. కానీ రిలీజ్ టైం దగ్గర పడుతుండగా అది వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తుంటారు.