Srikanth and Ooha: ఊహతో విడాకులు.. శ్రీకాంత్ రియాక్షన్ ఇదే!
విడాకుల వ్యవహరం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ గా మారింది. అయితే సెలబ్రిటీల్లో డివోర్స్ తీసుకునే సంఖ్య పెరిగిపోతోంది.
- By Balu J Published Date - 03:50 PM, Tue - 22 November 22
విడాకుల వ్యవహరం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారుతోంది. అయితే సెలబ్రిటీల్లో డివోర్స్ తీసుకునే సంఖ్య పెరిగిపోతోంది. టాలీవుడ్ బ్యూటీ కపుల్ సమంత, నాగచైతన్య డివోర్స్ వ్యవహరంతో అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ షాక్ తిన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మంచు మనోజ్ కూడా డివోర్స్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో మరో జంట డివోర్స్ తీసుకోబోతుందనే వార్త చక్కర్లు కొడుతున్నాయి. హీరో శ్రీకాంత్ తన భార్య ఊహ కు విడాకులు ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.
దీనిపై శ్రీకాంత్ స్పందిస్తూ, ప్రస్తుతం తన భార్య ఊహాతో తమిళనాడులో ఓ టూర్ ఉన్నానని, చాలా సంతోషంగా వెకేషన్ గడుపుతున్నానని విడాకుల వార్తను కొట్టిపారేశాడు. ఈ వ్యక్తిగత ఆధ్యాత్మిక యాత్ర తర్వాత సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లనున్నారు శ్రీకాంత్. టాలీవుడ్ లో శ్రీకాంత్, ఊహ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.
“ఆమె” సినిమా షూటింగ్ సమయంలో ఈ ఇద్దరూ ప్రేమలో పడిన తర్వాత 1997లో వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ లో అన్యోన్యంగా ఉండే జంటల్లో ఈ జంట ఒకటి. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. యాంకర్ సుమ, ఆమె భర్త రాజీవ్ కనకాల గురించి ఇంతకుముందు ఇలాంటి రూమర్స్ విన్నాం. వీరిద్దరూ ఆనందంగా ఉన్నా విడాకుల వార్తలు వచ్చాయి. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు ఇద్దరూ.
Related News
Tollywood: ‘సితార’ సినిమాకు 40 వసంతాలు.. తెలుగు చలన చిత్రాల్లో ఓ కల్ట్ క్లాసిక్!
Tollywood: పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన కళాత్మక కావ్యం సితార’. ఏప్రిల్ 27, 1984న విడుదలైన ఈ చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకుంది. పూర్ణోదయా చిత్రాలైన ‘తాయారమ్మ-బంగారయ్య’, ‘శంకరాభరణం’, ’సీతాకోకచిలక’చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన వంశీలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద నాగేశ్వరరావు, వంశీకి ఈ అవకాశం ఇచ్చారు. వంశీ రచించిన ‘మహల్లో క�