Director Shankar : చరణ్ తో ముగించేసిన శంకర్? కమల హాసన్ సినిమాకు షిఫ్ట్..
ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ షూట్ హైదరాబాద్ లో చేస్తున్నారని వెల్లడించారు. తాజాగా డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేశాడు.
- By News Desk Published Date - 08:15 PM, Wed - 10 May 23

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) RRR సినిమా తర్వాత ప్రస్తుతం శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా(Pan India) రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో చరణ్ రెండు పాత్రలు పోషించబోతున్నాడు. ఇప్పటికే సినిమా సెట్స్ నుంచి లీకైన పిక్స్ తో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ షూట్ హైదరాబాద్ లో చేస్తున్నారని వెల్లడించారు. తాజాగా డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేశాడు. తన ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. నేటితో గేమ్ ఛేంజర్ సినిమా క్లైమాక్స్ షూట్ పూర్తవుతుంది. నెక్స్ట్ కమల్ హాసన్ సినిమాకు షిఫ్ట్ అవుతాను అని ట్వీట్ చేశాడు. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా క్లైమాక్స్ ఫైట్ షూట్ పూర్తయినట్టు తెలుస్తుంది.
దాదాపు 1000 మంది ఫైటర్స్ తో భారీగా శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ ని తెరకెక్కించినట్టు సమాచారం. అయితే క్లైమాక్స్ ఫైట్ పూర్తయినా ఇంకా సినిమా షూట్ మొత్తం పూర్తవ్వలేదని తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ ఒకేసారి ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలకు పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు గేమ్ ఛేంజర్ షెడ్యూల్ పూర్తి చేసి ఇండియన్ 2 షూటింగ్ కి వెళ్తున్నాడు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజవుతుందని నిర్మాత దిల్ రాజు గతంలోనే ప్రకటించారు.
Wrapped up #GameChanger ‘s electrifying climax today! Focus shift to #Indian2 ‘s silver bullet sequence from tomorrow! pic.twitter.com/HDUShMzNet
— Shankar Shanmugham (@shankarshanmugh) May 9, 2023