Hanu Man OTT: ఓటీటీలో హనుమాన్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి.. వీడియో వైరల్?
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదలైన వ
- By Nakshatra Published Date - 11:16 PM, Mon - 18 March 24
టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా సంక్రాంతికి రిలీజైన హనుమాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే హనుమాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు చాలా ఆలస్యమైంది.
థియేటర్లలో రిలీజైన సుమారు 66 రోజుల తర్వాత కానీ ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి రాలేదు. అయితే ఎట్టకేలకు ఆదివారం మార్చి 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ రికార్డులు కొల్లగొడుతోంది. నేషనల్ వైడ్ గా టాప్ ట్రెండింగ్ లో ఉంటూ భారీ వ్యూస్ రాబడుతోంది. ఇదిలా ఉంటే సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన హనుమాన్ సినిమాకు అందరూ కనెక్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా పిల్లలు హనుమాన్ వీఎఫ్ ఎక్స్, విజువల్స్ కు ఫిదా అయ్యారు.
Awww 🥹🤗 https://t.co/HlczCf7Ewx
— Prasanth Varma (@PrasanthVarma) March 18, 2024
అయితే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వగానే మొదట చాలామంది నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేసారు. కానీ ఈ మూవీ వాటన్నింటిని దాటుకొని మరి సక్సెస్ టాక్ ని తెచ్చుకొన్ని కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓటీటీలో హనుమాన్ సినిమాను వీక్షించిన ఒక చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. సినిమా ఇంటర్వెల్ సమయంలో వచ్చే కుస్తీ ఫైట్ సీన్ లో విలన్ హీరోను కొట్టి కింద పడేస్తాడు. ఆ సీన్ చూసిన చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. బోరున ఏడ్చేసింది. అయితే తిరిగి హీరో లేచాక చప్పట్లు కొడుతుంది. ఈదీనికి సంబంధించిన వీడియోను చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా క్షణాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా స్పందించి రిప్లై కూడా ఇచ్చాడు. హనుమాన్ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో మెరవగా, వాన ఫేమ్ వినయ్ రాయ్ విలన్ గా అదరగొట్టాడు. వీరితో పాటు సముద్ర ఖని, వెన్నెల కిశోర్, జబర్దస్త్ శీను, తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు.
Related News
Teja Sajja : పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తేజ సజ్జ సినిమా చేయబోతున్నారా..?
పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తేజ సజ్జ సినిమా చేయబోతున్నారా..? ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన..