News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Dinesh Shalini Says We Became Actors Because Of That Movie

Jayamma Panchayathi: ఆ సినిమా వల్లే మేం నటులం అయ్యాం!

యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన 'జయమ్మ పంచాయితీ` చిత్రం ద్వారా తాము నటీనటులుగా పరిచయం అయ్యామని యువ జంట

  • By Balu J Published Date - 01:10 PM, Sat - 30 April 22
Jayamma Panchayathi: ఆ సినిమా వల్లే మేం నటులం అయ్యాం!

యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ` చిత్రం ద్వారా తాము నటీనటులుగా పరిచయం అయ్యామని యువ జంట దినేష్ కుమార్, షాలినీ తెలియజేస్తున్నారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ‘జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది. ఈ సందర్భంగా  యువ జంట దినేష్ కుమార్, షాలినీ మీడియా సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు.

దినేష్ కుమార్ మాట్లాడుతూ, నాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. దర్శకుడిది మా ఊరే. బి.టెక్ చదివాక మదర్బోర్డ్ డిజైనర్గా జాబ్ చేశాను. కానీ చిన్నతనంనుంచి నటుడు అవ్వాలనే కోరిక బలంగా వుండేది. 8 ఏళ్ళుగా చేస్తున్న కృషి ఫలించి ఏకంగా సుమగారి సినిమాలో అవకాశం రావడంఅదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు కాస్టింగ్ కాల్ ద్వారా నన్ను ఎంపిక చేశారు. దర్శకుడు మా ఊరివాడు కావడంతో మా ఇద్దరి మద్య ఫ్రీక్వెన్సీ బాగుంది. ఇందులో సత్య అనే పూజారి పాత్ర పోషించాను. విలేజ్లో అల్లరి చిల్లరిగా తిరిగే పూజారి అనిత అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత మా ఇద్దరి ప్రేమకు చిన్న సమస్య వస్తుంది. మరోవైపు జయమ్మకు ఓ సమస్య వుంటుంది. ఆమె సమస్యకూ మా సమస్యకూ లింక్ వుంటుంది. అది సినిమాలో చూడాల్సిందే.

నాకూ సుమగారికి కొన్ని సన్నివేశాలున్నాయి. ఆమెతో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను సోలో హీరోగా చేసినా రాని పబ్లిసిటీ `జయమ్మ.. సినిమాలో చేయడంవల్ల  వచ్చింది. ఇటీవలే కొన్ని ప్రాంతాలు పర్యటించాం. ట్రైలర్ లో నా పాత్ర బాగా పాపులర్ అయింది. అందరూ నన్ను గుర్తుపడుతున్నారు. నటుడికి మంచి బేనర్ దొరకడం కూడా లక్కే. నాకు భక్తి ఎక్కువ. మా ఊరిలో కోటదుర్గమ్మని మొక్కుకున్నా. యాదృశ్చికం గా నేను ఏదైతే అనుకున్నానో ఆ పాత్ర దొరకడం, ఆ అమ్మవారి సన్నిధిలోనే షూటింగ్ జరుపుకోవడం చాలా థ్రిల్ కలిగించింది.
జయమ్మ పంచాయితీ సినిమా నటుడిగా నిరూపించుకునే అవకాశం ఇచ్చింది. షాలినీ మాట్లాడుతూ, మా అమ్మగారిది మొగల్తూర్, నాన్నది హైదరాబాద్. నేను ఇక్కడే పెరిగాను. అయితే సినిమాలపై ఆసక్తి ఎక్కువ. అందుకే తమిళ షార్ట్ ఫిలిం చేశాను. ఆ తర్వాత కొన్ని రెస్టారెంట్ యాడ్స్ కూడా చేశాను. పాండమిక్ టైంలో కొంత గ్యాప్ వచ్చింది. జయమ్మ.. సినిమాకు పనిచేస్తున్న రచయిత నన్ను ఇందులో పాత్రకు ప్రిఫర్ చేశారు. దర్శకుడు ఆడిషన్  ద్వారా ఎంపిక చేశారు.

బేసిగ్గా నా పాత్ర వేరే ఊరునుంచి శ్రీకాకుళం వస్తుంది కాబట్టి నాకు యాస పలికే అవకాశం పెద్దగా వుండదు. కానీ మిగిలిన పాత్రలన్నీ చక్కగా యాసతో మాట్లాడారు. నా పాత్రకూ జయమ్మకు పెద్దగా సన్నివేశాలు వుండవు. కానీ మా లవ్ స్టోరీకి జయమ్మకు వచ్చిన సమస్యకూ లింక్ వుంటుంది. అది సినిమాలో ఆసక్తికరంగా వుంటుంది.  శ్రీకాకుళం, ఆముదాలవలస, పాలకొండ, కోటిపల్లి వంటి ప్రాంతాల్లో షూటింగ్ తీశారు. లొకేషన్లు చాలా సుందరంగా  వున్నాయి. ఇందులో నా రియల్ లైఫ్కు వ్యతిరేకమైన పాత్ర పోషించాను. పాత్ర అందరూ మెచ్చుకునేలా వుంటుంది. నటిగా నాకు గుర్తింపు వస్తుందనే నమ్ముతున్నాను.. అని చెప్పారు.

Tags  

  • interview
  • Jayamma Panchayathi
  • latest tollywood news
  • Suma Kanakala

Related News

Ali Exclusive: ‘ఎఫ్‌ 3’ పక్కా ఫైసా వసూల్‌ మూవీ!

Ali Exclusive: ‘ఎఫ్‌ 3’ పక్కా ఫైసా వసూల్‌ మూవీ!

‘ఎఫ్‌ 3.. పక్కా ఫైసా వసూల్‌ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే... మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది’

  • Parasuram Interview: మహేష్ బాబుకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాననే కిక్కుంది!

    Parasuram Interview: మహేష్ బాబుకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాననే కిక్కుంది!

  • Satyadev: జూన్ 17న స‌త్య‌దేవ్ ‘గాడ్సే’ గ్రాండ్ రిలీజ్

    Satyadev: జూన్ 17న స‌త్య‌దేవ్ ‘గాడ్సే’ గ్రాండ్ రిలీజ్

  • Samantha: సమంత మరో ప్యాన్ ఇండియా మూవీ!

    Samantha: సమంత మరో ప్యాన్ ఇండియా మూవీ!

  • Kushi: ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ‘విజయ్, సమంత’ల  ఖుషి!

    Kushi: ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ గా ‘విజయ్, సమంత’ల ఖుషి!

Latest News

  • Deepika Padukone:15 ఏళ్ల క్రితం నన్నెవరూ నమ్మలేదు.. దీపికా ఎమోషనల్!

  • Whats App : వాట్సాప్ గ్రూప్స్ లో మరో రెండు కొత్త ఫీచర్లు

  • Kinnera Moguliah : `ప‌ద్మ‌శ్రీ` వాప‌స్ కు కిన్నెర మొగుల‌య్య `సై`

  • Solar Power : రాత్రి వేళ `సోలార్ ప‌వ‌ర్` ఉత్ప‌త్తి

  • Nallala Odelu: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి నల్లాల ఓదెలు!

Trending

    • Solar Pole: సూర్యుడి ధృవపు మిస్టరీ గుట్టురట్టు.. ఫోటోలు,వీడియోలు పంపిన సోలార్ ఆర్బిటర్

    • Crocodile Attack: రాజస్థాన్ లో షాకింగ్ ఘటన…నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి మొసలి దాడి..!

    • Swami Nithyananda: నిత్యానందకు ఏమైంది? నిర్వికల్ప సమాధి అంటే ఏంటి?

    • Youngest Organ Donor: ఆరేళ్ల బాలిక అవయవదానం..ఎయిమ్స్ హిస్టరీలోనే తొలిసారి…అసలేం జరిగింది..!!

    • Viral Video : ఒకే బ్లాక్ బోర్డుపై..ఏక కాలంలో హిందీ, ఉర్దూ క్లాస్ లు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: