War 2 : వార్ 2లో ఎన్టీఆర్‌కి తమ్ముడిగా.. ఆ కన్నడ హీరో.. నిజమేనా..?
వార్ 2లో ఎన్టీఆర్‌కి తమ్ముడి పాత్ర ఉంటుందట. ఇక ఆ పాత్ర కోసం కన్నడ స్టార్..
- By News Desk Published Date - 07:22 AM, Sun - 26 May 24

War 2 : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘వార్ 2’. YRF స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ చేస్తున్న ఈ మూవీలో.. ఎన్టీఆర్ రా ఏజెంట్ గా ఒక ముఖ్యమైన పాత్రని పోషించబోతున్నారట. కాగా సినిమాలో మరో ముఖ్య పాత్ర కూడా ఉందట. ఆ పాత్రే ఎన్టీఆర్ తమ్ముడి రోల్.
ఇక ఆ రోల్ కోసం కూడా మరో స్టార్ట్ హీరోని తీసుకు వస్తున్నారట మేకర్స్. కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జా.. ఎన్టీఆర్ కి తమ్ముడిగా కనిపించబోతున్నారట. ఈ పాత్రకి చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంటుందట. మూవీలో ఈ పాత్ర చనిపోయిన తరువాతే.. ఎన్టీఆర్ క్యారెక్టర్ మొదలు కానుందట. తమ్ముడు కోసం ఎన్టీఆర్ ఏం చేసాడు అనేది మిగతా కథ అంట. మరో సౌత్ హీరో కూడా ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇస్తుండడంతో.. ఈ మూవీ పై మరిన్ని అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
వార్ 1తో పోలిస్తే ఈ సెకండ్ పార్ట్ లో యాక్షన్ పోర్షన్ కొంచెం ఎక్కువగానే ఉండబోతుందట. ముఖ్యంగా ఎన్టీఆర్ అండ్ హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తప్పించేలా డిజైన్ చేస్తున్నారట. ఈక్రమంలోనే మార్వెల్ మూవీ స్టంట్ మాస్టర్ స్పిరో రజాటోస్ ని తీసుకు వచ్చినట్లు సమాచారం. మరి మూవీలో ఈ యాక్షన్ పార్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.
కాగా ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్ గా నటిస్తుంటే.. కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 14న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.