Dhruva Natchathiram : రిలీజ్‌కి ముందు అర్ధరాత్రి స్టార్ హీరో సినిమా వాయిదా.. ఇప్పటికే ఆరేళ్ళు వాయిదా..
విక్రమ్(Vikram) హీరోగా తెరకెక్కిన 'ధ్రువ నక్షత్రం'(Dhruva Natchathiram) సినిమా ఎప్పుడో 2017 లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఏవో కారణాలతో ఈ సినిమా ఆరేళ్లుగా వాయిదా పడుతూ వస్తుంది.
- By News Desk Published Date - 06:44 AM, Fri - 24 November 23

విక్రమ్(Vikram) హీరోగా తెరకెక్కిన ‘ధ్రువ నక్షత్రం'(Dhruva Natchathiram) సినిమా ఎప్పుడో 2017 లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఏవో కారణాలతో ఈ సినిమా ఆరేళ్లుగా వాయిదా పడుతూ వస్తుంది. గౌతమ్ మీనన్(Gautham Menon) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల నవంబర్ 24న రిలీజ్ చేస్తామని ప్రకటించి సాంగ్స్, ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
కానీ సడెన్ గా సినిమా రిలీజ్ ఆపేశారు. నేడు సినిమా రిలీజ్ ఉండగా నిన్న అర్ధరాత్రి దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమా మళ్ళీ వాయిదా పడినట్లు తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. గౌతమ్ మీనన్ తన ట్విట్టర్ లో.. ధ్రువ నక్షత్రం సినిమా ఇవాళ రిలీజ్ చేయలేకపోతున్నాం అందుకు క్షమించండి. త్వరలోనే మీ ముందుకు వస్తాం. ఈ సారి అన్ని ప్రాపర్ గా అడ్వాన్స్ బుకింగ్స్, ప్రమోషన్స్ తో మీకు ఒక మంచి సినిమాని అందిస్తాం. ఇన్ని రోజులు ఈ సినిమా విషయంలో నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. త్వరలోనే మీ ముందుకు వస్తాం అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ఇప్పటికే ఆరేళ్లుగా ఈ సినిమా వాయిదాపడుతుందని విక్రమ్ అభిమానులు నిరాశలో ఉండగా మరోసారి రిలీజ్ కి ముందు ఇలా చేయడంతో విక్రమ్ అభిమానులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అసలు ఒక సినిమాకి ఇంతకాలం ఎందుకు లేట్ అయింది, మళ్ళీ ఎందుకు వాయిదా పడింది అని అభిమానులు, నెటిజన్లు గౌతమ్ మీనన్ ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్, రాధిక, సిమ్రాన్, అర్జున్ దాస్, వినాయకన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. మరి ధ్రువ నక్షత్రం ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో చూడాలి.
#DhruvaNatchathiram #DhruvaNakshathram pic.twitter.com/dmD4ndEnp9
— Gauthamvasudevmenon (@menongautham) November 23, 2023
Also Read : Bhagavanth Kesari : రేపటి నుండి భగవంత్ కేసరి స్ట‍్రీమింగ్ ..