Dhanush Box office: ధనుష్ బాక్సాఫీస్ రికార్డ్స్.. ‘సార్’ మూవీకి సెన్సేషనల్ కలెక్షన్స్!
ధనుష్ కు ఇతర సినిమాలు పోటీగా నిలువలేకపోవడంతో మంచి కలెక్లన్స్ సాధిస్తోంది.
- By Balu J Published Date - 01:29 PM, Mon - 20 February 23
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన ‘సార్’ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీని ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’ ‘శ్రీకర స్టూడియోస్’ తో కలిసి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. ‘మాస్టారు మాస్టారు’ అనే పాట అలాగే టీజర్, ట్రైలర్ లు సినిమా పై మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి.
గతవారం విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ మంచి కలెక్షన్లను రాబడుతోంది. అయితే ధనుష్ కు ఇతర సినిమాలు పోటీగా నిలువలేకపోవడంతో మంచి కలెక్లన్స్ సాధిస్తోంది. (Dhanush) సార్ (Sir) తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. సినిమా మొదటి వీకెండ్ కి ఊరమాస్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని అంచనాలను అన్నీ కూడా మరోసారి మూడో రోజున మించి పోయి సెన్సేషన్ ని క్రియేట్ చేయడం విశేషం అని చెప్పాలి. వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ పైన భారీ లాభాలను కూడా.. సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది ఈ సినిమా.
బాక్స్ ఆఫీస్ (Box Office) దగ్గర మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 2 కోట్లు కన్ఫాం అనుకోగా ఫైనల్ లెక్కలు బాగుంటే మరోసారి 2.5 కోట్ల దాకా వెళ్ళే చాన్స్ ఉందని అనుకోగా సినిమా ఏకంగా 3.05 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. సినిమా తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ బిజినెస్ 6.20 కోట్ల దాకా ఉండగా 6.70 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరంతో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 3.05 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే (Dhanush) మూవీకి రూ.33.58 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలా చూసుకుంటే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.34 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు రూ.9.03 కోట్ల షేర్ (Collections)ను రాబట్టింది. సో ఓవరాల్ గా ఇంకో రూ.24.55 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
Also Read: Taraka Ratna Dream: నెరవేరని ‘తారకరత్న’ కల.. బాబాయ్ బాలయ్యతో నటించకుండానే!
Related News
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కెరీర్ ట్రాక్ లో పడేనా.. ?
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో ‘హరి హర వీరమల్లు’, ‘రాజాసాబ్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఇద్దరు హీరోలతో నిధికి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నిధి బ్యాడ్ టైం ఎదుర్కొంటోందని, ఇప్పుడు ఆమె తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ కు ప్రేమికురాలిగా నటిస్తుండటంతో హరి హర వీరమల్�