Dhanraj : డైరెక్టర్ గా మారిన జబర్దస్త్ ఫేమ్ ధన్ రాజ్
హీరో కామ్ డైరెక్టర్ గా ధన్ రాజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 గా ధనరాజ్ దర్శకత్వంలో
- Author : Sudheer
Date : 06-11-2023 - 1:33 IST
Published By : Hashtagu Telugu Desk
జబర్దస్త్ షో (Jabardasth Show) ఎంతో మందిని పాపులర్ చేసింది..వారికంటూ ఓ గుర్తింపు తీసుకురావడమే కాదు సినీ అవకాశాలను వచ్చేసింది. ఇప్పటికే ఈ షో ద్వారా పరిచమైన చాలామంది సినిమాల్లో రాణిస్తున్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తుంటే..మరికొంతమంది హీరోలుగా , డైరెక్టర్స్ గా రాణిస్తున్నారు. ఈ మధ్యనే బలగం (Balagam) మూవీ తో వేణు (Venu) స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడమే కాదు ఎన్నో అవార్డ్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు వేణు బాటలోనే ధన్ రాజ్ తన అదృష్టాన్ని పరీక్షించుకెందుకు సిద్దమయ్యాడు.
We’re now on WhatsApp. Click to Join.
హీరో కామ్ డైరెక్టర్ గా ధన్ రాజ్ (Dhanraj) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 గా ధనరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
ఈ సినిమాలో ప్రముఖ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. తండ్రి కొడుకుల ఎమోషన్ తో ఎవరూ టచ్ చెయ్యని ఒక పాయింట్ తో ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు ధనరాజ్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు కథ మరియు మాటలు సమకూరుస్తూన్నారు. సంగీత దర్శకుడు అరుణ్ చిలువేరు ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు… ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ నవంబర్ 9 నుండి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.
Read Also : మరోసారి రవితేజ నట విశ్వరూపం.. ఈగల్ టీజర్ తో గూస్ బమ్స్!