Sreeleela with Ram: రామ్ తో రొమాన్స్ చేయనున్న ధమాకా బ్యూటీ శ్రీలీల!
హీరో రామ్ (Ram)కి జోడిగా శ్రీలీల (Sreeleela) నటిస్తోంది.
- By Balu J Published Date - 11:06 AM, Fri - 6 January 23
‘అఖండ’ (Akhanda) చిత్రాన్ని అందించిన బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati) ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ #బోయపాటిరాపో ని డైరెక్ట్ చేస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఉన్న అంచనాలను అందుకునేలా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హీరో రామ్ (Ram)కి జోడిగా టాలీవుడ్ మోస్ట్ హ్యపనింగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) నటిస్తున్న ఈ చిత్రం అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈరోజు చిత్ర షూటింగ్ లో శ్రీలీల (Sreeleela) జాయిన్ అయ్యింది. దర్శకుడు బోయపాటి, రామ్ శ్రీలీలకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. బోయపాటి శ్రీను, రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించనున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. #బోయపాటిరాపో హిందీ, అన్ని సౌత్ ఇండియన్ భాషలలో విడుదల అవుతుంది. ఈ బ్యూటీ (Sreeleela) నటించిన ధమాకా మూవీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.
Related News
Sreeleela: కోలీవుడ్ స్టార్ కు నో చెప్పిన శ్రీలీల.. ఎందుకో తెలుసా
Sreeleela: కోలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న అందాల తార శ్రీలీల తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న ‘ఓటీటీ’లో ఐటెం సాంగ్ చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. ఓ పాటతో తమిళ చిత్రసీమలో తన కెరీర్ ను ప్రారంభించడం ఆమెకు ఇష్టం లేదని, కోలీవుడ్ లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఓటీటీ’ చిత్ర నిర్మాతల ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించారని చెన్నై వర్గాలు త�