Thandel : చైతు భార్యకు దేవి స్పెషల్ థాంక్స్..ఎందుకంటే..!!
Thandel : నాగ చైతన్య తన భార్య శోభితను బుజ్జితల్లి అని పిలుస్తారని తెలిసి, ఆ పదంతోనే పాట రాసానని దేవిశ్రీ పేర్కొన్నారు
- By Sudheer Published Date - 07:10 AM, Wed - 12 February 25

‘తండేల్ లవ్ సునామీ’ (Thandel Movie Success Meet) వేడుక అక్కినేని అభిమానులకు మరచిపోలేని అనుభూతిని అందించింది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు నాగార్జున (Nagarjuna) గెస్ట్‌గా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల (Sobhita ) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమాకి సంబంధం లేకపోయినా ఆమె హాజరు కావడం విశేషంగా మారింది. ఈ సందర్భంగా, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri) శోభితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
WPL Full Schedule 2025: డబ్ల్యూపీఎల్ 2025 షెడ్యూల్, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “తండేల్ సినిమాతో శివుడిపై మరో అద్భుతమైన పాట ఇవ్వడం నా అదృష్టం” అన్నారు. ఇదే సమయంలో నాగార్జునతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ‘ఢమరుకం’ చిత్రంలోని ‘శివ శివ శంకర’ పాట గురించి ప్రస్తావించారు. “నాగ్ సార్ అప్పట్లో ఈ పాటకు ఇచ్చిన ప్రశంసలు ఇప్పటికీ మర్చిపోలేను” అని చెప్పిన దేవి అదే అనుభూతి ‘తండేల్’లో కూడా కలిగిందన్నారు. అలానే నాగ చైతన్య తన భార్య శోభితను బుజ్జితల్లి అని పిలుస్తారని తెలిసి, ఆ పదంతోనే పాట రాసానని దేవిశ్రీ పేర్కొన్నారు. “మీ పేరు మీద పాట చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినందుకు థాంక్స్ శోభిత” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఈ వేడుకలో శోభిత మాత్రం స్టేజ్ పైకి రాకుండా కింద నుంచే ఈవెంట్‌ను ఆస్వాదించడం గమనార్హం.
ఇక చివరిగా ‘తండేల్’ టీమ్‌కు నాగార్జున ప్రత్యేక అభినందనలు తెలిపారు. తన కొడుకు చైతన్య నటనను చూసి తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గుర్తొచ్చారని భావోద్వేగంతో చెప్పారు. సినిమా గొప్ప విజయం సాధించినందుకు దర్శకుడు చందుతో పాటు మొత్తం చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.