Kalki Controversy : ‘కల్కి’ వివాదంపై స్పందించిన దీపిక
Kalki Controversy : తల్లి అయిన తర్వాత కూడా కెరీర్ కొనసాగించడం ఎంత కష్టమో చెప్పడంతో అనేక మంది మహిళలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు
- By Sudheer Published Date - 10:20 AM, Fri - 10 October 25

బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకొణె తనపై వస్తున్న విమర్శలకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఇటీవల ఆమెను “స్పిరిట్” మరియు “కల్కి 2898 AD” సీక్వెల్‌ల నుంచి తప్పించారన్న వార్తలు ప్రచారం కావడంతో సోషల్ మీడియాలో చర్చ చెలరేగింది. ఈ నేపథ్యంలో దీపికా మీడియా ముందు మాట్లాడుతూ, “నేను పని చేసే పద్ధతి ఎప్పటికీ ప్రొఫెషనల్‌గానే ఉంటుంది. తల్లి అయిన తర్వాత కూడా నా బాధ్యతలను సమతుల్యంగా నిర్వహిస్తున్నాను. కానీ నేను 8 గంటలే పనిచేస్తానని చెప్పగానే ఎందుకు వివాదం సృష్టిస్తున్నారు? అదే విషయాన్ని పురుష నటులు చెబితే మాత్రం ఎవ్వరూ ప్రశ్నించరు” అని తీవ్రంగా స్పందించారు.
Vastu Tips: ఏంటి.. ఈ ఒక్క పూల మొక్కను నాటితే కోటీశ్వరులు అవుతారా.. కాసుల వర్షం కురుస్తుందా?
దీపికా వ్యాఖ్యల్లో సమాన హక్కులపై ఉన్న అవగాహన స్పష్టంగా కనిపించింది. “ఎంతో మంది మేల్ సూపర్‌స్టార్లు గత ఇన్నేళ్లుగా 8 గంటల పని సమయానికే కట్టుబడి ఉంటున్నారు. వీకెండ్లలో వారికి పూర్తి విశ్రాంతి ఉంటుంది. కానీ వారు హెడ్లైన్స్‌లో రావడం లేదు. నేను మాత్రం అదే చేస్తే అది పెద్ద వార్త అవుతోంది” అని ఆమె వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఆమె మాటల ద్వారా సినీ పరిశ్రమలో ఉన్న లింగ వివక్షతను పరోక్షంగా ప్రస్తావించారు. ప్రసవం తర్వాత తల్లి అయిన స్త్రీ కూడా తన వృత్తి జీవితాన్ని సమర్థవంతంగా కొనసాగించగలదనే సందేశాన్ని ఆమె బలంగా ఇచ్చారు.
దీపికా పదుకొణె (Deepika Padukone )వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళా నటీమణుల స్థానం, గౌరవం, వర్క్ కల్చర్‌పై పెద్ద చర్చకు దారి తీశాయి. తల్లి అయిన తర్వాత కూడా కెరీర్ కొనసాగించడం ఎంత కష్టమో చెప్పడంతో అనేక మంది మహిళలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. సినీ రంగం కూడా మహిళా నటీమణుల వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తూ, సమాన అవకాశాలు కల్పించాలి అనే అవగాహన పెరగాలి అని అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, దీపికా తన సమాధానంతో కేవలం వ్యక్తిగత విమర్శలకు ప్రతిస్పందించడమే కాకుండా, మహిళా సమానత్వానికి గళం విప్పినట్లయింది.