Deepika Padukone : దీపికా పదుకొనె మరో సౌత్ సినిమా.. ఈసారి ఆ స్టార్ తో రొమాన్స్..!
Deepika Padukone కోలీవుడ్ స్టార్ హీరో శింబు లేటెస్ట్ మూవీ అప్డేట్ ఆ హీరో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. పత్తుతల సినిమా తర్వాత శింబు చేస్తున్న సినిమాపై ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా
- Author : Ramesh
Date : 26-01-2024 - 8:11 IST
Published By : Hashtagu Telugu Desk
Deepika Padukone కోలీవుడ్ స్టార్ హీరో శింబు లేటెస్ట్ మూవీ అప్డేట్ ఆ హీరో ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. పత్తుతల సినిమా తర్వాత శింబు చేస్తున్న సినిమాపై ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్స్ ని మెప్పించింది.
We’re now on WhatsApp : Click to Join
సినిమాలో రజిని నటించాల్సింది కానీ అది కరగలేదు. దేశింగు పెరియసామి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫైనల్ గా శింబు హీరోగా ఫిక్స్ అయ్యాడు. లోక నాయకుడు కమల్ హాసన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో హీరో విలన్ ఇద్దరు శింబునే చేస్తున్నారట. అయితే సినిమాలో హీరోయిన్స్ గా కూడా ఇద్దరు క్రేజీ భామలని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఒక శింబుకి బాలీవుడ్ అందాల భామ దీపిక పదుకొనె కాగా మరొకరికి కీర్తి సురేష్ అని తెలుస్తుంది.
చాలా గ్యాప్ తర్వాత కీర్తి సురేష్ సౌత్ సినిమాల్లో నటిస్తుంది. ఆల్రెడీ ప్రభాస్ తో కల్కి సినిమాలో అమ్మడు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆమెకు మరో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఇక మరో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. తమిళంలో కీర్తి సురేష్ ఫ్యాన్స్ గురించి తెలిసిందే. మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో శింబు అదరగొట్టబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఫిబ్రవరి 3వ వారంలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
Also Read : Srileela : శ్రీలీలకి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకున్నారా..?