Yash : హీరోగా మారుతున్న డ్యాన్స్ మాస్టర్ యశ్.. దిల్ రాజు నిర్మాణంలో సినిమా..
డ్యాన్స్ మాస్టర్ గా యశ్ ఇప్పటికే చాలా సినిమాలకు, చాలా మంది స్టార్ హీరోలతో వర్క్ చేశాడు. ప్రస్తుతం యశ్ సినిమాలు, పలు టీవీ షోలతో బిజీగా ఉన్నాడు.
- By News Desk Published Date - 09:03 PM, Mon - 24 July 23
ఇండస్ట్రీలో డ్యాన్సర్ గా ఎంట్రీ ఇచ్చిన యశ్(Yash) పలు టీవీ షోలలో పాల్గొని, పలు సినిమాలకు డ్యాన్సర్ గా వర్క్ చేసి త్వరగానే డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు. డ్యాన్స్ మాస్టర్ గా యశ్ ఇప్పటికే చాలా సినిమాలకు, చాలా మంది స్టార్ హీరోలతో వర్క్ చేశాడు. ప్రస్తుతం యశ్ సినిమాలు, పలు టీవీ షోలతో బిజీగా ఉన్నాడు.
కొన్ని సినిమాలలో కూడా యశ్ సాంగ్స్ లో మెరిపించాడు. యశ్ ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. ఇటీవల దిల్ రాజు కూతురు, అల్లుడు నిర్మాతలుగా మారి దిల్ రాజు ప్రొడక్షన్స్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాగా బలగం తీసి భారీ హిట్ కొట్టారు. బలగం సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలుసు. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. ఇప్పుడు రెండో సినిమాగా మ్యూజికల్ లవ్ ఎంటెర్టైనర్ తో రాబోతున్నారు.
డ్యాన్స్ మాస్టర్ యశ్ హీరోగా, మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్ గా శశికుమార్ దర్శకత్వంలో హన్షిత, హర్షిత నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ‘ఆకాశం దాటి వస్తావా’ అనే మెలోడీ టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
Get ready to be enchanted by the musical love tale of #AakasamDhaatiVasthaava ❤️
Introducing 🌟
Supremely talented Choreographer 𝐘𝐚𝐬𝐡 as the lead actor,
𝐊𝐚𝐫𝐭𝐡𝐢𝐤𝐚 𝐌𝐮𝐫𝐚𝐥𝐞𝐞𝐝𝐡𝐚𝐫𝐚𝐧 as the female lead, pic.twitter.com/xnM9w43pvv— Dil Raju Productions (@DilRajuProdctns) July 24, 2023
Also Read : Tillu Square : DJ టిల్లు 2 వచ్చేశాడు.. అనుపమతో ఓపెన్ గా ఫ్లర్టింగ్ చేస్తున్న టిల్లు..
Related News
Kiara Advani : యష్ టాక్సిక్ లో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. అమ్మడి ఖాతాలో మరో లక్కీ ప్రాజెక్ట్..!
Kiara Advani బాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోయిన్స్ కు చెక్ పెడుతూ ఒకదానికి మించి మరొక చాన్స్ అందుకుంటూ వస్తుంది అందాల భామ కియరా అద్వాని.