Daddy Movie Child Artist : ‘డాడీ’ మూవీలోని పాప ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
అప్పుడు డాడీలో తన ముద్దు ముద్దు మాటలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న చిన్న పాప అనుష్క.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
- By News Desk Published Date - 10:00 PM, Sat - 19 August 23

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ఫాదర్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘డాడీ'(Daddy). 2001 లో రిలీజ్ అయిన ఈ చిత్రంలో సిమ్రాన్, అషిమా బల్ల హీరోయిన్స్ గా నటించగా రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాస రావు, శరత్ బాబు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిన్న గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఇక చిరంజీవి కూతురిగా ఈ సినిమాలో ‘అనుష్క మల్హోత్రా’ (Anushka Malhotra) డ్యూయల్ రోల్ లో కనిపించింది. మూవీలో చిరంజీవి అండ్ అనుష్క మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటాయి.
అప్పుడు డాడీలో తన ముద్దు ముద్దు మాటలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న చిన్న పాప అనుష్క.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ముంబైలో జన్మించిన అనుష్క డాడీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తరువాత బాలీవుడ్ లో పలు సినిమాల్లో కనిపించింది. అయితే సినిమాల వల్ల తన చదువు చెడిపోతుందని భావించిన ఆమె పేరెంట్స్.. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి అనుష్కని తీసుకోని ఇంగ్లండ్ వెళ్లిపోయారు. ఇక అనుష్క అక్కడ బర్మింగ్‌హామ్‌లోనే ఉంటూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం లండన్ లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ గా జాబ్ చేస్తుంది.
అయితే సోషల్ మీడియా ద్వారా ఈ భామ ఇక్కడ ప్రేక్షకులను పలకరిస్తుంటుంది. స్నేహితులతో కలిసి డాన్స్‌లు, అల్లర్లు చేసిన వీడియోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఈ పోస్టుల్లో అనుష్క అందాన్ని చూసిన నెటిజెన్స్ మీరు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వొచ్చు కదా అని కామెంట్స్ చేస్తుంటారు. నిజానికి అనుష్కకి బాలీవుడ్ నుంచి హీరోయిన్ ఆఫర్స్ కూడా వచ్చాయట. కానీ ఆమెకు సినిమాలపై పెద్ద ఆసక్తి లేకపోవడంతో రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం అనుష్కకు 27 ఏళ్ళు. డాడీలో అక్షయ/ఐశ్వర్యగా క్యూట్ గా కనిపించి అల్లరి చేసిన అనుష్క ఇప్పుడు ఇలా హీరోయిన్ రేంజ్ లో మారిపోయింది.
Also Read : Brahmanandam Son Marriage : బ్రహ్మానందం రెండో తనయుడి వివాహం.. బ్రహ్మానందం కోడలు ఎవరు? ఏం చేస్తుందో తెలుసా?