Conductor Jhansi : కండక్టర్ ఝాన్సీ కి సినిమా ఛాన్స్
సత్యా రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా సినిమా 'ఉక్కు సత్యాగ్రహం'
- Author : Sudheer
Date : 25-11-2023 - 3:40 IST
Published By : Hashtagu Telugu Desk
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినా ఎంతోమంది చిత్రసీమలోకి అడుగుపెట్టి రాణిస్తున్నారు. తాజాగా ‘పల్సర్ బైక్’ పాటతో ఫేమస్ అయిన గాజువాక కండక్టర్ ఝాన్సీ (Conductor Jhansi) కి సైతం సినిమా ఛాన్స్ తలుపుతట్టింది. కండక్టర్గా విధులు నిర్వహిస్తూనే ఎన్నో పాటలకు స్టేజ్ పర్ఫామెన్స్ చేసిన ఝాన్సీ.. ఈటీవీలో ప్రసారమయ్యేటువంటి కార్యక్రమంలో పల్సర్ బైకు (Pulsar Bike) పాట కు డాన్స్ వేసి మంచి పాపులారిటీతోపాటు క్రేజీ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు షోస్ , రీల్స్ ఇలా ప్రతిదానితో తనకంటూ ఇమేజ్ ను సొంతం చేసుకొని..ఇప్పుడు ఆ క్రేజ్ తో సినిమా ఛాన్స్ కొట్టేసింది.
సత్యా రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ… స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తాజా సినిమా ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రూపొందుతోంది. ఈ సినిమాలో కండక్టర్ ఝాన్సీ నటిస్తుంది. ”ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ఏం చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో మంచి అంశాలు ఉన్నాయి. అందువల్ల, నటించాలని అనుకున్నాను. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సత్యారెడ్డి గారికి థాంక్స్” అని ఝాన్సీ తెలిపింది. ‘ఉక్కు సత్యాగ్రహం’ ట్రైలర్, పాటలను గద్దర్ కుమార్తె వెన్నెల విడుదల చేశారు.
Read Also : KCR Corruption: కేసీఆర్ ని జైలుకు పంపిస్తాం: అమిత్ షా