Fish Venkat : దారుణమైన పరిస్థితి లో ‘ఫిష్ వెంకట్’ సాయం కోసం ఎదురుచూపు
తన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తోందని, ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేసుకుంటున్నానని
- By Sudheer Published Date - 06:30 PM, Wed - 4 September 24
ప్రముఖ కమెడియన్ ‘ఫిష్ వెంకట్’ (Fish Venkat) దారుణమైన స్థితిలో ఉన్నాడు..ఎవరైన సాయం చేయాలనీ వేడుకుంటున్నాడు. వెండితెరపై కనిపించే వారంతా ఆర్ధికంగా బలంగా ఉంటారని..వారికీ ఎలాంటి కష్టాలు ఉండవని..వారు ఏది అనుకుంటే అది జరిగిపోతుందని..డబ్బుకు కొరత ఉండదని అంత భావిస్తారు. కానీ సినిమా కష్టాలు తెలిసిన వారు మాత్రం ఆలా ఉహించుకోరు. ఇక్కడ ఛాన్సులు ఉంటేనే డబ్బు..ఛాన్సులు తగ్గినా ..రాకపోయినా అంతే సంగతి. కనీసం తినేందుకు తిండి కూడా ఉండదు..ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అంతే సంగతి..దాతల కోసం ఎదురుచూపులు తప్పవు. ఇలా ఎంతోమంది చిత్రసీమలో దయనీయమైన స్థితిలో ఉన్నారు. తాజాగా ‘ఫిష్ వెంకట్’ కూడా అలాంటి పరిస్థితే ఎదురుకుంటున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఆది సినిమాలో తొడగొట్టు చిన్నా అనే డైలాగ్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకొని వెంకట్..కమెడియన్ గా విలన్ గా దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించాడు. సినిమాల్లో బాగా ఎదిగిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దయనీయ స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు ఎంతోమందికి దానాలు చేసిన ఫిష్ వెంకట్ ఇప్పుడు చేయి చాచే స్థితిలో ఉన్నాడు. గతంలో వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఆయన్ను అనారోగ్యం ఇంటికే పరిమితం చేసింది. అసలు ఏమైంది వెంకట్ కు అని ఆరా తీస్తే.. తన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తోందని, ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేసుకుంటున్నానని తన పరిస్థితి గురించి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. షుగర్ వల్ల కాలు బాగా లావు అయ్యిందని, నాలుగేళ్ళ క్రితం ఆపరేషన్ చేసుకున్నానని, ఆ తర్వాత కూడా కాలుకు ఎఫెక్ట్ అయింది. అప్పట్నుంచి ఇలా కాలు మీద చర్మం పోతుంది. అప్పట్నుంచి వీక్ అయ్యాను. అంటూ చెప్పుకొని బాధపడ్డారు.
తనకు ఈ పరిస్థితి వచ్చిన ఇప్పటివరకు ఎవరికి చెప్పుకోలేదని తనకి ఇద్దరు మగపిల్లలు .. ఒక ఆడపిల్ల ఉన్నారనీ, మగపిల్లలు డబ్బు పరంగా ఎలాంటి సాయం చేయడం లేదని ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక ఫిష్ వెంకట్ పరిస్థితిని తెలుసుకున్న నెటిజన్లు చలించిపోతూ..చిత్రసీమ సాయం చేయాలనీ..కోరుకుంటున్నారు.
Read Also : Yoga : రోజూ 40 నిమిషాలు యోగా.. మధుమేహం ముప్పు తగ్గుతుందని అధ్యయనంలో వెల్లడి..!
Related News
Producer Chadalavada Help to Fish Venkat : ఫిష్ వెంకట్ కు ప్రముఖ నిర్మాత సాయం
Actor Fish Venkat : అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్ కు ఎవరైనా సాయం చేస్తే బాగుండని వేడుకుంటున్నారు