Ali : అయన సీఎం..నేను హోమ్ మినిస్టర్ – అలీ కీలక కామెంట్స్
థాయ్‌లాండ్ ఓ రాజ్యం కాబట్టి సరిపోయింది కానీ , అక్కడ ఎన్నికలు పెడితే పూరి జగన్నాథ్ సీఎం .. తాను హోమ్ మినిస్టర్ అని వ్యాఖ్యానించారు
- By Sudheer Published Date - 08:27 PM, Wed - 26 June 24

సినీ నటుడు అలీ (Ali) అంటే తెలియని వారు ఉండరు. బాల నటుడి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి టాప్ కమెడియన్ గా , హీరో గా అభిమానులను , ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అలాగే పలు షోస్ కు యాంకర్ గా కూడా రాణిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ కి ప్రచారం చేసి..కాస్త ఇండస్ట్రీ కి దూరం అయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో అసలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఈయన అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో అలీ డైరెక్టర్ పూరి ఫై కీలక కామెంట్స్ చేసారు. ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన అలీ.. మాట్లాడుతూ థాయ్‌లాండ్ ఓ రాజ్యం కాబట్టి సరిపోయింది కానీ , అక్కడ ఎన్నికలు పెడితే పూరి జగన్నాథ్ సీఎం .. తాను హోమ్ మినిస్టర్ అని వ్యాఖ్యానించారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే అలీ ఈ మాటలు అనడం వెనుక కారణం ఉందండోయ్..పూరికి కష్టం అనిపించినా, మూడీగా ఉన్నా వెంటనే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో వాలిపోతారు. అక్కడ బీచ్‌లలో కూర్చొని కథలు రాసుకోవడం ఆయనకు అలవాటు. తన సినిమాల్లో కొన్ని సన్నివేశాలైనా బ్యాంకాక్‌లో షూట్ జరుపుకోవాల్సిందే. అంతేకాదు తనకు బ్యాంకాక్‌లో అభిమానులు ఉన్నారని, అక్కడ పోటీ చేసినా గెలుస్తానని పూరి ఎన్నోసార్లు చెప్పారు. బ్యాంకాక్ బీచ్‌లలో చూపు తిప్పుకోకుండా ఉండలేమని, అలాంటి చోట స్క్రిప్ట్ రాయడం కష్టమని కానీ ఆ ప్రదేశాల్లో ఉంటేనే మన ఏకాగ్రత ఎంతో తెలుస్తుందని పూరీ అన్నారు. ఆయనతో స్నేహామో ఏమో కానీ అలీ కూడా థాయ్‌లాండ్ ఎక్కువగా విజిట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Read Also : Urgent Requirement : ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర తొండలు, బల్లులు, ఉడుతలను పట్టేవాళ్ళు కావలెను