Puri Jagannadh: చిరుతో పూరి.. ‘గాడ్ ఫాదర్’లో స్పెషల్ రోల్!
మెగాస్టార్ చిరంజీవి మాస్, పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గాడ్ ఫాదర్‌లో ఇప్పటికే చాలా ప్రత్యేకతలున్నాయి.
- Author : Balu J
Date : 09-04-2022 - 12:18 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రతిఒక్కరికీ ఇష్టాలు, లక్ష్యాలూ ఉంటాయి. కానీ జీవిత ప్రయాణంలో మనం ఒకటి తలిస్తే.. విధి మరొకటి రాస్తుంది. టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరున్న పూరి కెరీర్ ప్రారంభంలో నటుడిగా రాణించాలనుకున్నాడు. కానీ సీట్ కట్ చేస్తే స్టార్ డైరెక్టర్ గా మారాడు. తనలోని నటన అలాగే మరుగున పడిపోయింది. మళ్లీ చాన్నాళ్లకు పూరి కలను మెగాస్టార్ చిరంజీవి నిజం చేశాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్, పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గాడ్ ఫాదర్ సినిమాలో ఇప్పటికే చాలా ప్రత్యేకతలున్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ మూవీ నుంచి మరో కొత్త అప్‌డేట్ వచ్చింది. దర్శకుడు పూరీ జగన్నాధ్ మరో ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లో ఈరోజు నుంచి జాయిన్ అయ్యాడు.
పూరీకి పూల బొకే అందించి చిరంజీవి స్వాగతం పలుకుతున్న దృశ్యం ఫొటోలో చూడొచ్చు. చిరు షర్ట్‌పై 786 నంబర్‌తో ఖైదీ యూనిఫామ్‌లో కనిపిస్తుండగా, పూరీ బ్లాక్ టీస్‌లో కనిపిస్తున్నాడు. కాగా పూరి కొన్ని చిత్రాలలో అతిధి పాత్రలలో కనిపించాడు. అయితే ఇది చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే అతను చిరంజీవితో కలిసి నటించడం ఇదే మొదటిసారి. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మెగా బడ్జెట్ ఎంటర్‌టైనర్‌కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నయనతార ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే
introducing my @purijagan in a special role,from the sets of #Godfather pic.twitter.com/8NuNuoY33j— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2022