HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevis Favorite Story For Ravi Teja

Ravi Teja: మెగా క్లాప్ తో రవితేజ చిత్రం షురూ!

`టైగర్ నాగేశ్వరరావు` చిత్రం ఉగాది ప‌ర్వ‌దినాన క‌నుల‌పండువ‌గా ప్రారంభ‌మైంది.

  • Author : Balu J Date : 02-04-2022 - 7:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tiger
Tiger

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న `టైగర్ నాగేశ్వరరావు` చిత్రం శ‌నివారం శుభ‌కృతు నామ సంవ‌త్స‌రం ఆరంభ‌మైన‌ ఉగాది ప‌ర్వ‌దినాన క‌నుల‌పండువ‌గా ప్రారంభ‌మైంది. క‌రోనా త‌ర్వాత క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో అంగ‌రంగ‌వైభంగా జ‌రిగిన ఈ వేడుక మాదాపూర్‌లోని నోవాటెల్‌లో (హెచ్‌ఐసిసిలో) జ‌రిగింది. పూజా కార్య‌క్ర‌మాలు అనంత‌రం హీరో ర‌వితేజ‌, హీరోయిన్లు నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పుషాట్‌కు ముఖ్య అతిథి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్ట‌గా, కెమేరా స్విచ్చాన్ తేజ్ నారాయణ అగర్వాల్ చేశారు. కిషన్ రెడ్డి స్క్రిప్ట్‌ని అందజేసారు. క‌శ్మీర్ ఫైల్స్ ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

టైగర్ నాగేశ్వరరావు ప్రీలుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను చిరంజీవి ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, శుభ‌కృతు నామ సంవ‌త్స‌రంలో అంద‌రికీ శుభాలు జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు. టైగర్ నాగేశ్వరరావు క‌థ‌ను పేండ‌మిక్ టైంలో ద‌ర్శ‌కుడు వంశీ నాకు క‌థ వినిపించారు. చాలా అద్భుతంగా నెరేట్ చేశారు. ఆ త‌ర్వాత నాకు సాధ్య‌ప‌డ‌లేదు. ఇప్పుడు నా త‌మ్ముడు ర‌వితేజ చేయ‌డం చాలా సంతోషంగా వుంది. ఈ స్టువ‌ర్ట్ పురం నాగేశ్వ‌ర‌రావు గురించి నేను చాలా చిన్న‌ప్పుడే విన్నాను. మా నాన్న‌గారు చీరాల‌ పేరాల‌లో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ ప‌క్క‌నే స్టువ‌ర్ట్‌పురం వుండేది. అక్క‌డి వారంతా నాగేశ్వ‌ర‌రావుని హీరోగా కొనియాడుతుండేవారు. ఆస‌క్తితో నాన్న‌గారినుంచి చాలా విష‌యాలు తెలుసుకున్నాను. ఇన్నాళ్ళ త‌ర్వాత ఆయ‌న గురించి వంశీ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌గా తీర్చిదిద్దారు. త‌మ్ముడు ర‌వితేజ సినిమా చేయ‌డం శుభం. అందుకు అభిషేక్ అగ‌ర్వాల్ పూనుకోవ‌డం చాలా ఆనందంగా వుంది. ఇటీవ‌లే వారు క‌శ్మీర్ ఫైల్స్‌తో స‌క్సెస్ మూడ్‌లో వున్నారు. కొత్త సంవ‌త్స‌రంలో పూర్త‌యి త్వ‌ర‌గా విడుద‌ల‌యి క‌శ్మీర్ ఫైల్స్ ఎంత హిట్ట‌యిందో అంత‌కంటే హిట్ అయి ర‌వితేజ‌కు, అభిషేక్‌కు, వంశీకి మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు. చిత్ర హీరో ర‌వితేజ మాట్లాడుతూ, అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు.

హీరోయిన్ నూపుర్ సనన్ మాట్లాడుతూ, టైగర్ నాగేశ్వరరావు చిత్రం తెలుగులో నా మొద‌టి సినిమా. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో న‌టించ‌డం ఆనందంగా వుంది. ఉగాది పండుగ సంద‌ర్భంగా ప్రారంభం కావ‌డం మ‌రింత ఆనందంగా వుంది. నాకు ఈ అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాన‌ని తెలిపారు. మ‌రో నాయిక గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ, ద‌క్షిణాదిలో తెలుగు సినిమాకు ప‌నిచేయ‌డం, అందులోనూ పాన్ ఇండియా సినిమాకు ప‌నిచేయ‌డంతో ఒళ్ళు పుల‌క‌రిస్తోంది. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌, హీరో, ద‌ర్శ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాన‌ని అన్నారు.

బి.జె.పి. నాయ‌కుడు కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ, జీవితంలో తీపి, చేదు, వ‌గ‌రు ఇలాంటి ఎన్నో అనుభూతులు క‌లిగించే ఉగాదినాడు టైగర్ నాగేశ్వరరావు చిత్రం ప్రారంభోత్స‌వం కావ‌డం ఆనందంగా వుంది. అభిషేక్ అగ‌ర్వాల్‌, వారి నాన్న‌గారు అనేక ఏళ్ళుగా కుటుంబ మిత్రులు. ఇటీవ‌లే వారు క‌శ్మీర్ ఫైల్స్ అనే సినిమా తీసి భార‌తీయులంద‌రికీ పండిట్‌ల క‌థ‌ను తెలిసేలా చేశారు. ద‌ర్శ‌కుడు వివేక్ సాధ్య‌మైన‌మేర‌కు క‌థ‌ను చూపించ‌గ‌లిగారు. ఇంకా చాలా విష‌యాలు పండిట్‌ల గురించి చ‌ర్చించాల్సి వుంది. చాలా మంది సినిమాలు తీస్తారు. దేశానికి ఉప‌యోప‌డే సినిమాలు కొన్నే వుంటాయి. ఉప‌యోగ‌ప‌డే సినిమా తీసిన అభిషేక్‌ను అభినందిస్తున్నా. ఇప్పుడు కూడా టైగర్ నాగేశ్వరరావు క‌థ‌ను తీస్తున్నారు. ఈ సినిమా కూడా విజ‌య‌వంతం కావాల‌ని భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నాన‌ని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు వంశీ మాట్లాడుతూ, చిరంజీవిగారి చేతుల‌మీదుగా ప్రారంభోత్స‌వం జ‌ర‌గడం ఆనందంగా వుంది. ర‌వితేజ‌తో నాలుగేళ్ళుగా ప్ర‌యాణం చేశాను. ఈ క‌థ‌కు ఆయ‌నే బాగుంటుంద‌ని అనుకోవ‌డం, ఆయ‌న అందుకు ఒప్పుకోవ‌డంతో మాకు ఎంతో ఎన‌ర్జీ ఇచ్చారు. ర‌వితేజ ఫ్యాన్సేకాదు తెలుగు హీరోల ఫ్యాన్స్ కూడా మెచ్చే చిత్ర‌మ‌వుతుంద‌ని హామీ ఇస్తున్నాన‌ని తెలిపారు.

రేణుదేశాయ్ మాట్లాడుతూ, వంశీ 2019లో ఈ సినిమా క‌థ‌లోని పాత్ర గురించి చెప్పారు. ఆ టైంలో మ‌ర‌లా తెరపై క‌న్పించాల‌నే ఆలోచ‌న‌లేదు. కానీ పాత్ర బాగా న‌చ్చ‌డంతో చేయాల‌నే ఉత్సాహం క‌లిగింది. ద‌ర్శ‌కుడు వంశీ నాపై పూర్తి న‌మ్మ‌కంగా వున్నారు. ఇండియాలో గొప్ప ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకుంటాడ‌నే న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు.

క‌శ్మీర్ ఫైల్స్ ద‌ర్శ‌కుడు వివేక్ అగ్ని హోత్రి మాట్లాడుతూ, గొప్ప సినిమాలు నిబ‌ద్ద‌తోనే వ‌స్తాయి. అందుకు సినిమా బాగా వ‌చ్చేలా నాకు తోడ్ప‌డిన అభిషేక్‌గారికి, వారి నాన్న‌గారికి ధ‌న్య‌వాదాలు తెలియజేసుకుంటున్నా. వంశీని గ‌త ఏడాది క‌లిశాను. ఆయ‌న నా సినిమాపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నారు. నేను ఇప్పుడు ర‌వితేజ‌తో చేస్తున్న ఈ సినిమా కూడా అంత‌కంటే మ‌రింత న‌మ్మ‌కంతో వున్నాను. ఇండియ‌న్ చ‌రిత్ర‌లో క‌శ్మీర్ ఫైల్స్ 300 కోట్ల క్రాస్ చేసింది. ఈ సంద‌ర్భంగా టైగ‌ర్ అభిషేక్‌ను అభినందిస్తున్నాను అన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • latest tollywood news
  • raviteja
  • Tiger Nageswara Rao

Related News

Chiranjeevi Creates a Buzz on the Peddi Sets

Ram Charan పెద్ది సెట్స్ లో చిరంజీవి సందడి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా సెట్స్‌పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్‌ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు. The BOSS and my GURU on sets of #Peddi… It’s one of the best […

  • Celebrities Congratulations To Vijay On TVK

    Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!

  • Chandrababu Naidu At Bandla

    Bandla Ganesh : చంద్రబాబు సమక్షంలో బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థ వేడుక

Latest News

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

  • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

  • Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

  • Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

  • Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd