Chiranjeevi: చిరంజీవి కి 44 ఏళ్ళు ..
కొణిదెల శివశంకర ప్రసాద్ చిరంజీవిగా పుట్టి ఈ రోజుకు 44 ఏళ్లైంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశారు.
- By HashtagU Desk Published Date - 08:01 PM, Thu - 22 September 22
కొణిదెల శివశంకర ప్రసాద్ చిరంజీవిగా పుట్టి ఈ రోజుకు 44 ఏళ్లైంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశారు. శిశంకర ప్రసాద్ గా ఆయన పుట్టిన రోజు ఆగస్టు 22, 1955. అయితే, సినిమా నటుడిగా ఆయన పుట్టిన రోజు 22, సెప్టెంబరు 1978. ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ద్వారా ప్రాణం పోసుకుని 44 సంవత్సరాలైంది. ‘‘ మీకు తెలిసిన చిరంజీవి, చిరంజీవిగా పుట్టిన రోజు, ఈ రోజు 22 సెప్టెంబరు 1978.
‘ప్రాణం ఖరీదు’ ద్వారా ప్రాణం పోసి, ప్రాణప్రదంగా, నా ఊపిరై, నా గుండె చప్పుడై, అన్నీ మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఎప్పటికీ.. మీ చిరంజీవి’’ అని తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. కొణిదెల శివశంకర ప్రసాద్ చిరంజీవిగా పుట్టి అంచెలంచెలుగా ఎదిగి మెగా స్టార్ ఎలా అయ్యారో మనకి తెలుసు.
Chiranjeevi the Actor as you all know was born today, 22 September 1978, 44 years ago! I owe this limitless love and affection I receive from you all, to this day!
I owe everything to this day!
Humbled and Grateful! 🙏🙏🙏#PranamKhareedu #22Sept1978#DebutMovieRelease pic.twitter.com/LoFcpEo9Zo
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2022
Related News
Chiranjeevi : ‘ముఠామేస్త్రి’ సినిమా కోసం.. అప్పట్లో భారీ ధరకి టికెట్ కొన్న అభిమాని.. పేపర్లో వార్త..
ముఠామేస్త్రి చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈక్రమంలోనే టికెట్ సంపాదించడం కోసం ఫ్యాన్స్ వందలు ఖర్చుపెట్టారు. అలా రాజమండ్రిలోని ఓ అభిమాని..