Chiranjeevi : సెల్ఫీ తీసుకుంటుండగా అభిమానిని నెట్టిసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సెల్ఫీ తీసుకుంటున్న అభిమానిని పక్కకు నెట్టేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది
- By Sudheer Published Date - 05:43 PM, Tue - 30 July 24

అభిమానులు (Fans)..ఇది అందరికి దక్కే అవకాశం ఉండదు. ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే తప్ప తమకంటూ అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా చిత్రసీమలో చిన్న హీరోల దగ్గరి నుండి పెద్ద హీరోల వరకు వారికంటూ అభిమానులు ఉంటారు. ఈ అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందంటే..తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే సొంతగా డబ్బులు ఖర్చు చేసి కటౌట్స్ ఏర్పాటు చేయడం..ప్లెక్సీ లు కట్టడం ..హీరోల పుట్టిన రోజుల నాడు పండ్లు , దుప్పట్లు పంచడం..కేక్స్ కట్ చేయడం ఇలా ఎన్నో చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు.
మరి ఇంత చేస్తున్న వారికోసం హీరోలు ఏమైనా చేస్తారా ఏమి ఉండదు..ఒక్క సెల్ఫీ అడిగితే తోసేయడం..పక్కకు నెట్టడం..కొట్టడం ఇలా ఎన్నో చేస్తారు. అయినాగానీ అభిమానులు మాత్రం తమ హీరోనే గొప్ప అని భావిస్తారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సెల్ఫీ తీసుకుంటున్న అభిమానిని పక్కకు నెట్టేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. రీసెంట్ గా నాగార్జున సెక్యూర్టీ కూడా ఇలాగే చేసి నాగార్జునను వివాదాల్లో పడేసాడు. ఎయిర్ పోర్ట్ లో ఓ పెద్దాయన..నాగ్ తో సెల్ఫీ కోసం ట్రై చేస్తుండగా..నాగార్జున (Nagarjuna) పక్కన ఉన్న సెక్యూర్టీ గార్డ్..నెట్టేశాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఘటన అప్పుడు వైరల్ గా మారింది. దీనిపై పెద్ద ఎత్తున నాగ్ ఫై విమర్శలు చేసారు. ఆ తర్వాత నాగ్ క్షేమపణలు తెలియజేయడమే కాదు స్వయంగా మరోసారి ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ఆ పెద్దాయను దగ్గరికి తీసుకొని సెల్ఫీ దిగాడు. ఇక ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi ) స్వయంగా తన దగ్గరికి ఓ యువకుడు వచ్చి సెల్ఫీ తీసుకుంటుండగా..పక్కకు నెట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ‘సెలబ్రెటీ ఎవరైనా ఒక్కటే అది off the Camara లో చిరంజీవి అయినా ..ఇంకెవరైనా….ముందు వాళ్ళని అంతా ఎత్తులో చూడడం మానేయాలి. నీ కంటే హీరో ఎవరు ఉండరు అనే ఆత్మాభిమానం ఉండాలి ఎవరికైనా… అంటూ కామెంట్స్ వేస్తున్నారు.
సెలబ్రెటీ ఎవరైనా ఒక్కటే
అది off the Camara లో @KChiruTweets అయినా
ఇంకెవరైనా….
ముందు వాళ్ళని అంతా ఎత్తులో చూడడం మానేయాలి.
నీ కంటే హీరో ఎవరు ఉండరు అనే ఆత్మాభిమానం ఉండాలి ఎవరికైనా…@NewsmeterTelugu@TeluguScribe @TV9Telugu @V6News @ANI pic.twitter.com/Rs78NOV0WG— AdvKatkuri (@AdvKatkuri) July 29, 2024
Read Also : Justice Madan Bhimrao Lokur : విద్యుత్ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ మదన్ బీ లోకూర్..