Chiranjeevi : పవన్, చరణ్ సినిమాల్లో.. చిరంజీవి ఫేవరెట్ ఏంటో తెలుసా..?
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాల్లో చిరంజీవి ఫేవరెట్ ఏంటో తెలుసా..? పవన్ సినిమాల్లో అంత లిస్ట్ చెప్పిన చిరంజీవి..
- Author : News Desk
Date : 10-05-2024 - 5:45 IST
Published By : Hashtagu Telugu Desk
Chiranjeevi : ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ ఎదిగిన చిరంజీవి నీడ నుంచి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా చాలామంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వీరిలో చిరంజీవికి అత్యంత ఇష్టమైన వారంటే.. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని కూడా రామ్ చరణ్ లా కొడుకు లాగానే భావిస్తారు. చరణ్ సినిమాలు చూసి ఒక తండ్రిగా ఎంత మురిసిపోతారో పవన్ సినిమాలు చూసి కూడా అంతే మురిసిపోతారు.
మరి ఈ ఇద్దరు నటించిన సినిమాల్లో చిరంజీవికి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఈ విషయాన్ని కిషన్ రెడ్డి, చిరంజీవిని ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ.. “పవన్ కళ్యాణ్ సినిమాల్లో తొలిప్రేమ, బద్రి, జల్సా, అత్తారింటికి దారేది సినిమా చాలా ఇష్టం. పవన్ చేసింది కొన్ని సినిమాలే అయినా అన్ని బాగుంటాయి, ఒకటి రెండు తప్ప. ఇక చరణ్ సినిమాల్లో రెండో మూవీ మగధీర అంటే చాలా ఇష్టం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా మెగా అభిమానుల్లో ఒక పెద్ద కొరికే ఉంది. అదేంటంటే, మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ ని ఒకే ఫ్రేమ్ లో స్క్రీన్ పై చూడాలని. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఒకసారి కనిపించారు. అలాగే చరణ్ తో కూడా చిరంజీవి కలిసి నటించారు. కానీ ముగ్గురు కలిసి మాత్రం కనిపించలేదు. స్క్రీన్ పై జస్ట్ ఒక ఫ్రేమ్ లో అయినా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కనిపిస్తే చాలు అంటూ అభిమానులు ఎప్పటినుంచో ఆశపడుతున్నారు. అందుకోసం ప్రతి దర్శకుడికి తమ రిక్వెస్ట్ లను తెలియజేస్తున్నారు. మరి ఈ ముగ్గుర్ని ఏ దర్శకుడు ఒకే స్క్రీన్ పైకి తీసుకు వస్తారో చూడాలి.