HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Chiranjeevi As Ntrs Son Do You Know In Which Movie He Thought

NTR-Chiranjeevi : ఎన్టీఆర్ కొడుకుగా చిరంజీవి..ఏ చిత్రంలో అనుకున్నారో తెలుసా..?

  • Author : Sudheer Date : 09-01-2024 - 3:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr Son Chiru
Ntr Son Chiru

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు(NTR) సినీ ప్రస్థానం గురించి కొత్తగా..ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ చాలామంది మాత్రం ఎన్టీఆర్ లాగానే దేవుడు ఉంటాడు కావొచ్చు అని అనుకునే స్థాయిలో ఆయన తన నటనతో…రూపంతో కట్టిపడేసారు. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కొత్త మార్పు తీసుకొచ్చి అందరికి అన్న అనిపించుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్ తో ఎంతోమంది..ఎన్నో సినిమాల్లో నటించారు. చివరగా మోహన్ బాబు (Mohan Babu) కూడా ఎన్టీఆర్ చివరి చిత్రంలో నటించి అదృష్టవంతుడయ్యాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ అదృష్టం మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) కి కూడా వచ్చిందట..అది కూడా ఎన్టీఆర్ కు కొడుకు గా నటించే ఛాన్స్ వచ్చిందట. కాకపోతే డేట్స్ కుదరక ఆ ఛాన్స్ మిస్ అయ్యింది లేకపోతే చిరంజీవి కొడుకు గా నటిస్తే ఆ లెక్క మరోలా ఉండేది. ఎన్టీఆర్ కథానాయకుడిగా 1981 అక్టోబర్ 7 న విడుదలైన మూవీ కొండవీటి సింహం (Kondaveeti Simham). ఈ మూవీలో ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ గా ఎన్టీఆర్ ప్రదర్శించిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటిని ఈ చిత్రం బ్రేక్ చేసింది. అలాంటి గొప్ప చిత్రం లో ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ గా రాము గా డ్యూయల్ రోల్ లో ఎన్టీఆర్ పోషించాడు.

రంజిత్ కుమార్ కి ఒక కొడుకు పుట్టగానే ఆ కొడుకు ఉంటే రంజిత్ కుమార్ ప్రాణాలకి ప్రమాదమని జ్యోతిష్యుడు చెప్పడంతో రంజిత్ కుమార్ మావయ్య ఆ బిడ్డని దూరం చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంకో కొడుకు పుట్టి చెడ్డవాడిగా మారతాడు. ఈ క్యారక్టర్ కే చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు మొదట చిరంజీవిని అనుకున్నాడు. నిర్మాతలు కూడా ఆయన నిర్ణయానికి ఓకే చెప్పడంతో రాఘవేంద్రరావు చిరంజీవిని ఎన్టీఆర్ రెండో కొడుకు పాత్రలో నటింప చెయ్యాలని అనుకున్నాడు. కానీ చిరంజీవి డేట్స్ లేకపోవడంతో ఆ క్యారక్టర్ మోహన్ బాబుకి వెళ్లడం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా రాఘవేంద్రరావే ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.ఈ విధంగా డేట్స్ కనుక అడ్డుపడకపోయి ఉంటే చిరంజీవి ఎన్టీఆర్ కొడుకుగా నటించేవాడు. అంతకు ముందు చిరంజీవి ఎన్టీఆర్ తో కలిసి తిరుగులేని మనిషి సినిమాలో నటించాడు.

Read Also : Ambati Arjun : అర్జున్ అంబటి కోరిక తీరింది..బంగారుతల్లి అడుగుపెట్టింది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • Kondaveeti Simham
  • ntr

Related News

Chiranjeevi, SS Rajamouli, Jr NTR among Tollywood Celebrities Congratulate Team India

T20 World Cup : చరిత్ర సృష్టించిన టీమిండియా..సినీ ప్రముఖుల రియాక్షన్ ఇలా..!!

Chiranjeevi, SS Rajamouli, Jr NTR among Tollywood Celebrities Congratulate Team India  టీమిండియా టీ20 ప్రపంచకప్ 2026 విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు కూడా జట్టుకు అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి జట్టు చూపించిన పట్టుదల, టీమ్‌వర్క్‌ను ప్రశంసిస్తూ దేశాన్ని గర్వపడేలా చేసిన విజయమని పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనను కొనియాడుతూ ఈ విజయం 14

  • Jr. NTR Loses Cool

    NTR : ఎన్టీఆర్ చెప్పిన సమాధానంతో అంత షాక్

  • Chiranjeevi to Receive NTR National Award at Gaddar Film Awards 2025

    చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd