Chiranjeevi – Ajith : చిరంజీవి సినిమా సెట్‌లో అజిత్ కుమార్.. 30ఏళ్ళ తరువాత మళ్ళీ..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. 30ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు.
- By News Desk Published Date - 02:14 PM, Wed - 29 May 24

Chiranjeevi – Ajith : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. 30ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు. చిరంజీవితో అజిత్ కుటుంబంకి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అదేంటంటే, అజిత్ నటించిన మొదటి సినిమా ‘ప్రేమ పుస్తకం’ మ్యూజిక్ ఆల్బం చిరంజీవి చేతులు మీదుగానే లాంచ్ అయ్యింది. అలా అజిత్ మొదటి సినిమా కోసం చిరంజీవి తన సహాయాన్ని అందించారు. ఆ తరువాత చిరంజీవి, అజిత్ ని మళ్ళీ కలుసుకోలేదు.
అజిత్ తో మాత్రమే కాదు, అతని సతీమణి షాలినితో కూడా చిరంజీవికి ఒక బంధం ఉంది. చిరంజీవి నటించిన సూపర్ హిట్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో షాలిని మరియు ఆమె సిస్టర్ షామిలి చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. ఇలా చిరుతో అజిత్ కుటుంబంకి ఒక ప్రత్యేక సంబంధం ఉంది. ప్రస్తుతం అజిత్ సూపర్ స్టార్‌డమ్ ని అందుకొని.. తమిళ్ పరిశ్రమలో బిగ్గెస్ట్ స్టార్ గా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం అజిత్ తెలుగు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న పక్కనే చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్ కూడా జరుగుతుంది. దీంతో అజిత్ కుమార్.. విశ్వంభర సెట్స్ లోకి వచ్చి చిరంజీవిని కలుసుకున్నారు. దాదాపు 30ఏళ్ళ తరువాత కలుసుకోవడంతో పాత జ్ఞాపకాలను అన్ని నెమరువేసుకున్నారు.
ప్రేమ పుస్తకం ఆడియో లాంచ్ సందర్భం, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా షాలిని గురించి మాట్లాడుకున్నట్లు చిరంజీవి తెలియజేసారు. అలాగే అజిత్ తో ఉన్న ఫోటోలను కూడా చిరు తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.