Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ప్లాప్ అని చరణ్ ఒప్పుకున్నట్లేనా..?
Game Changer : జీవితమంటే అనుభవాల పరంపర. తప్పులు తప్పవు
- By Sudheer Published Date - 04:54 PM, Sat - 18 January 25

సంక్రాంతికి విడుదలైన సినిమాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ చేంజర్’ (Game Changer) ఒకటి. శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో భారీ థియేటర్స్ లలో విడుదలైంది. కానీ మొదటి ఆట తోనే మిక్సెడ్ టాక్ రావడం ఇదే క్రమంలో పైరసీ ప్రింట్ రావడం తో సినిమా పై ఎఫెక్ట్ భారీగా పడింది. టాక్ తో పాటు ప్రింట్ కూడా వచ్చేయడం, ఇదే క్రమంలో సంక్రాంతి బరిలో వచ్చిన డాక్ మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సూపర్ హిట్ టాక్ రావడం తో జనాలంతా ఆ సినిమాలే చూసేందుకు పోటీ పడుతున్నారు. దీంతో గేమ్ ఛేంజర్ ను పట్టించుకునే నాధుడు కరవయ్యాడు. సినిమా మూడో రోజే చాల థియేటర్స్ సంక్రాంతికి వస్తునాం కు కేటాయించడం మొదలుపెట్టారు.
Manchu Family Controversy : కలెక్టర్ వద్దకు మంచు గొడవ
సినిమా మేకర్స్ సైతం గేమ్ ఛేంజర్ ను వదిలేసి, సంక్రాంతికి వస్తున్నాం పై ఫోకస్ చేసి మరింత ప్రచారం చేస్తూ సినిమా కలెక్షన్లు పెంచే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటె రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…జీవితంలో ఎదురయ్యే అపజయాలను ఎలా ఎదుర్కొంటారనే విషయాన్ని తెలిపారు. ‘జీవితమంటే అనుభవాల పరంపర. తప్పులు తప్పవు. అయితే వాటిని పునరావృతం చేయకుండా ఉండటమే కీలకం. సమయం అన్నింటికీ సమాధానం చెబుతుంది. తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదు. కాలంతో పాటు ప్రతిదీ సరిగ్గా మారుతుంది’ అని ఓ షోలో చెప్పుకొచ్చారు. ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి గేమ్ ఛేంజర్ ప్లాప్ అవ్వడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.