Naga Chaitanya Rangasthalam : ఇది నాగ చైతన్య రంగస్థలం.. అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా..?
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం చందు మొండేటితో ఒక సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్
- By Ramesh Published Date - 11:22 AM, Thu - 9 November 23

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం చందు మొండేటితో ఒక సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. కార్తికేయ 2 తో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న చందు నాగ చైతన్యతో చేసే సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ఒక గుజరాత్ లో జరిగిన కథ ఆధారంగా రూపొందిస్తున్నారట. సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మ్యాన్ గా కనిపించనున్నాడు.
ఈ సినిమా కోసమే నాగ చైతన్య తన లుక్ మార్చేశాడు. గుబురు గడ్డంతో నాగ చైతన్య ఈమధ్య ఎక్కడ చూసినా ఎట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. ఇదంతా చందు సినిమా కోసమే అని తెలుస్తుంది. సినిమాలో క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. నాగ చైతన్య కెరీర్ లోనే ఇది ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచేలా ఉండబోతుందని అంటున్నారు.
Also Read : Sai Rajesh : శ్రీదేవికి ఆర్జీవీ ఎలాగో.. నేను హెబ్బా పటేల్ కి అంతే.. బేబీ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక కొందరైతే రాం చరణ్ కి రంగస్థలం (Rangasthalam) ఎలానో నాగ చైతన్యకు చందు మొండేటి డైరెక్షన్ లో వచ్చే సినిమా అలా అని అంటున్నారు. అదే జరిగితే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా కాలర్ ఎగరేసుకుంటారని చెప్పొచ్చు. కస్టడీ ఫ్లాప్ తర్వాత చందు సినిమాకు సన్నద్ధం అవుతున్న నాగ చైతన్య. ఓ పక్క విక్రం కుమార్ (Vikram Kumar) డైరెక్షన్ లో చేసిన ధూత సినిమాను రిలీజ్ కు రెడీ చేశారు.
లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో హిట్ అందుకున్న నాగ చైతన్య అదే రేంజ్ లో ఫ్లాపులు కూడా ఇస్తున్నాడు. మరి చందుతో చేస్తున్న సినిమా నిజంగానే నాగ చైతన్య రేంజ్ ని పెంచుతుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా కోసం బడ్జెట్ కూడా 100 కోట్ల దాకా పెడుతున్నట్టు తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join