Sai Rajesh : శ్రీదేవికి ఆర్జీవీ ఎలాగో.. నేను హెబ్బా పటేల్ కి అంతే.. బేబీ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
‘అలా నిన్ను చేరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
- Author : News Desk
Date : 08-11-2023 - 11:06 IST
Published By : Hashtagu Telugu Desk
దర్శకుడిగా, నిర్మాతగా అంతకుందు పలు సినిమాలు తీసినా ఇటీవల బేబీ(Baby) సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు డైరెక్టర్ సాయి రాజేష్(Sai Rajesh). తాజాగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సాయి రాజేష్ హీరోయిన్ హెబ్బా పటేల్(Hebah Patel) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దినేష్ తేజ, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ముఖ్య పాత్రల్లో తెరకెక్కించిన ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 10న విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ ఈవెంట్ లో సాయి రాజేష్ మాట్లాడుతూ.. సినిమా గురించి మాట్లాడి చిత్రయూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. అనంతరం హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి మాట్లాడుతూ.. ఆర్జీవీకి శ్రీదేవి ఎలానో నేను హెబ్బా పటేల్‌కు అంత పెద్ద ఫ్యాన్‌ని, ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలి అని అన్నారు. దీంతో సాయి రాజేష్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో వైరల్ గా మారాయి.
Also Read : Manchu Vishnu : రష్మిక ఫేక్ వీడియోపై ఫైర్ అయిన మంచు విష్ణు.. ‘మా’ తరపున పోరాడతాం..