Chaitu – Shobitha Wedding : చైతు రెండో పెళ్లి..అంత సింపులా..?
Chaitu - Shobitha Wedding : కేవలం 300-400 మంది కుటుంబ సభ్యులు, బంధువులు, ఇండస్ట్రీలోని సన్నిహితులను మాత్రమే ఆహ్వానించబోతున్నారట
- By Sudheer Published Date - 11:28 AM, Fri - 22 November 24

డిసెంబర్ 04 న శోభిత(Sobhita Dhulipala)తో కలిసి జీవితం పంచుకోబోతున్నాడు నాగచైతన్య (Naga Chaitanya). ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత (Samantha) కు విడాకులు ఇచ్చిన చైతు..ఈమెను రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ మధ్యనే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ జరిగింది. చాలా రోజులుగానే ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని దాటవేస్తూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. అది కూడా ఎంగేజ్‌మెంట్ తో సర్‌ప్రైజ్ ఇచ్చి. ఎంగేజ్‌మెంట్ తాలూకా పిక్స్ తో ఆ తర్వాత ఇద్దరు కలిసి ఉన్న పిక్స్ కానీ తో హల్చల్ చేస్తూ వచ్చారు.
ఇక ఈ పెళ్లి ఎంత ఘనంగా జరుపుతారో..? ఎంత మందికి ఆహ్వానం పంపిస్తారో..? ఎలాంటి సెట్టింగ్ ఉంటాయో..? ఏ రేంజ్లో జరుపుతారో..? అంటూ అభిమానులంతా ఎదురుచూస్తూ..మాట్లాడుకుంటున్నారు. అయితే నాగార్జున (Nagarjuna) మాత్రం ఈ పెళ్లి వేడుకను చాల సింపుల్ గా జరపబోతున్నట్లు తెలుస్తుంది. భారీ ఆర్భాటాలకు వెళ్లకుండా..అతికొద్ది మంది సమక్షంలో తన సొంత స్టూడియో అన్నపూర్ణ లో ఈ పెళ్లి వేడుకను జరపబోతున్నారట. కేవలం 300-400 మంది కుటుంబ సభ్యులు, బంధువులు, ఇండస్ట్రీలోని సన్నిహితులను మాత్రమే ఆహ్వానించబోతున్నారట. చైతు -శోభిత ఇద్దరు కూడా సింపుల్ వెడ్డింగ్ కోరుకోవడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఎందుకు వారు సింపుల్ కోరుకున్నారో అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరికీ రెండో పెళ్లి కావడంతో ఎందుకు ఆర్భాటాలకు వెళ్లడం అని అనుకున్నారేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Read Also : Harish Rao : రైతుల ధాన్యం అమ్మకాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేపట్టడం లేదు