Chaitu-Shiva Nirvana Combo : మరోసారి శివ నిర్వాణ తో చైతు..హీరోయిన్ ఎవరో తెలుసా..?
Chaitu-Shiva Nirvana Combo : చైతూ కోసం కూడా అలాంటి కథ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇక ఈ మూవీ లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ని కథానాయికగా ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయి
- Author : Sudheer
Date : 30-10-2024 - 7:34 IST
Published By : Hashtagu Telugu Desk
అక్కినేని నాగ చైతన్య – శివ నిర్వాణ (Chaitu-Shiva Nirvana) కలయికలో ‘మజిలీ’ (Majili) వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చైతు కెరియర్ లోనే కాదు సమంత కెరియర్ లోను ఈ మూవీ ఓ మైలు రాయి చిత్రంగా నిలిచింది. ఈ మూవీ తర్వాత శివ..విజయ్ దేవరకొండ తో ఖుషి చేసాడు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ..బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు, ‘ఖుషి’ తరవాత శివ నిర్వాణ ఎవరితో సినిమా చేస్తాడనేది ఆసక్తిగా మారగా.. నాగచైతన్యతో ఆయన ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. ఇదో లవ్ స్టోరీ అని సమాచారం. శివ నిర్వాణ లవ్ స్టోరీల్ని బాగా రాసుకొంటాడు. ఆయన కెరీర్‌లో ఎక్కువగా కనిపించే కథలు అవే. ఇప్పుడు చైతూ కోసం కూడా అలాంటి కథ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇక ఈ మూవీ లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ని కథానాయికగా ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయి. చైతూ – జాన్వీ కూడా ఇంట్రస్టింగ్ కాంబోనే. శ్రీదేవి అటు ఏఎన్నార్ తోనూ, ఇటు నాగ్ తో నూ నటించారు. ఆమె వారసురాలు అక్కినేని మూడో తరం హీరోతో జట్టు కట్టడం ట్రేడ్ పరంగా ఓ ఇంట్రస్టింగ్ పాయింట్. సో.. ఈ కాంబో దాదాపుగా సెట్టయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఈ మూవీ విడుదలయ్యే ఛాన్సుంది. అది మిస్సయితే… ఫిబ్రవరికి వస్తుంది. ఈ మూవీ పై చైతు భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఎందుకంటే గత కొంతకాలంగా చైతు సరైన హిట్ లేక బాధపడుతున్నాడు. తండేల్ తో సూపర్ హిట్ అందుకొని..తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ మూవీ ని చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా..సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. బన్నీ వాసు నిర్మాత.
Read Also : Ghee Massage : నాభి ప్రాంతంలో నెయ్యితో మసాజ్.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!