Jiah Khan suicide: నటి జియాఖాన్ కేసులో సంచల తీర్పు
బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో నిందితుడు, నటుడు సూరజ్ పంచోలీ నిర్దోషిగా విడుదలయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.
- By Praveen Aluthuru Published Date - 08:51 AM, Sat - 29 April 23

Jiah Khan suicide: బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో నిందితుడు, నటుడు సూరజ్ పంచోలీ నిర్దోషిగా విడుదలయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. 2013 జూన్ 3వ తేదీ జియా ఖాన్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.
గజినీ, నిశ్శబ్ద్ వంటి చిత్రాలలో అద్భుతంగా నటించి వెలుగులోకి వచ్చిన జియాఖాన్ ఆత్మహత్య అందరినీ ఆశ్చర్యపరిచింది. జియా మరణాన్ని ఆమె తల్లి హత్యగా అభివర్ణించారు. జియా సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. నటుడు సూరజ్ పంచోలీ గురించి రాసిన ఈ లేఖలో “నువ్వు నాకు బాధను మాత్రమే ఇచ్చావు, కానీ నేను నిన్ను మాత్రమే ప్రేమించాను” అని సూసైడ్ నోట్ లో పేర్కొంది. నీ కోసం అన్నీ వదులుకున్నాను కానీ నువ్వు నాకు ఒంటరితనాన్ని మాత్రమే ఇచ్చావు అంటూ తన బాధను లెటర్ రూపంలో పంచుకుంది.
జియా ఆత్మహత్యకు సూరజ్ పంచోలీ ప్రేరేపించాడని అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆత్మహత్యకు గంట ముందు సూరజ్‌కు జియా పలుమార్లు కాల్స్ చేశారని, అయితే అతను పట్టించుకోలేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంతకుముందు సూరజ్ జియాకు అనుచిత భాషలో 10 సందేశాలు పంపాడు. అయితే ఎట్టకేలకు ప్రత్యేక సీబీఐ కోర్టు సూరజ్‌ను అన్ని అభియోగాల నుంచి నిర్దోషిగా ప్రకటించింది.
Read More: Jio Cinema: జియో సినిమా నుంచి మూడు అదిరిపోయే ప్లాన్స్.. ధరల వివరాలు ఇవే?