Actor Sritej : నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
actor Sritej : శ్రీ తేజ్‌పై కూకట్ పల్లిలో గతంలోనూ కేస్ నమోదు అయినట్టుగా తెలుస్తోంది. పెళ్లయిన మరో వివాహితతో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి
- By Sudheer Published Date - 01:54 PM, Tue - 26 November 24

టాలీవుడ్ నటుడు శ్రీతేజ్ (Actor Sritej)పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని అతనిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. శ్రీ తేజ్‌పై కూకట్ పల్లిలో గతంలోనూ కేస్ నమోదు అయినట్టుగా తెలుస్తోంది. పెళ్లయిన మరో వివాహితతో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ సంబంధం విషయం తెలిసి వివాహిత భర్త గుండెపోటుతో మరణించినట్టుగా సమాచారం. ఆ ఘటనలోను శ్రీ తేజ్‌పై మాదాపూర్‌లో కేసు నమోదు అయ్యింది. వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, పుష్ప ది రైజ్, మంగళవారం, ధమాకా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీతేజ్ ప్రస్తుతం పుష్ప ది రూల్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ తేజ్‌పై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో యువతీ కేసు పెట్టింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని పిర్యాదు చేయడంతో అతడిపై పోలీసులు బీఎన్‌ఎన్ 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. శ్రీతేజ్ మంచి నటుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. పరంపరం, బహిష్కరణ అంటూ మంచి వెబ్ సిరీస్‌లో ఇంపార్టెంట్ రోల్స్ పోషించి గుర్తింపు పొందాడు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ బిజీగా ఉన్న శ్రీ తేజ్ ఇలా వరుస కేసుల్లో ఇరుకుంటూ కెరియర్ ను నాశనం చేసుకునే పరిస్థితి వస్తుందని అయన అభిమానులు అంటున్నారు. మరి వీటి నుంచి శ్రీతేజ్ ఎలా బయటపడతాడు? అసలు వీటిల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే శ్రీతేజ్ నోరు విప్పాల్సిందే.
Read Also : CM Chandrababu: ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారు