Mirzapur : మిర్జాపూర్ సీజన్ 3 వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే..!
క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ 'మీర్జాపూర్' రిలీజ్ కి సిద్దమవుతుంది. ఎప్పుడు విడుదల కాబోతుందో తెలుసా..?
- By News Desk Published Date - 03:27 PM, Wed - 29 May 24

Mirzapur : వెబ్ సిరీస్ లవర్స్ అంతా బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సిరీస్ లోని కొన్ని పాత్రలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మున్నా, త్రిపాఠి, బీనా, గుడ్డు, గోలు.. ఇలా కొన్ని ముఖ్యమైన పాత్రలు మాస్ ఆడియన్స్ ని బాగా అలరించాయి. రెండు సీజన్స్ తో ఆకట్టుకున్న ఈ సిరీస్ మూడో సీజన్ కోసం అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.
ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సీజన్ 3.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక ఈ మూడో సీజన్ ని జులైలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నారట. త్వరలోనే సీజన్ ప్రోమోని మరియు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారట. ఆడియన్స్ లో మంచి హైప్ ఉన్న ఈ సీజన్.. ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
కాగా ఈ సిరీస్ కి ఇంతటి క్రేజ్ రావడానికి ముఖ్య కారణం.. మున్నా పాత్ర. అయితే సీజన్ 2లో ఆ పాత్ర చనిపోయినట్లు చూపించారు. మరి మూడో సీజన్ లో ఆ పాత్రని చనిపోయినట్లే చూపిస్తారా..? లేదా ఆ పాత్రకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని, మళ్ళీ బ్రతికించి తీసుకు వస్తారా అనేది చూడాలి.
కాగా ఈ సిరీస్ ని కరణ్ అన్షుమాన్ తెరకెక్కిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే సీజన్ 1 అండ్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.