Pamela Chopra: బాలీవుడ్ లో విషాదం.. యశ్ చోప్రా భార్య కన్నుమూత
దివంగత దర్శకుడు యశ్ చోప్రా సతీమణి పమేలా చోప్రా (Pamela Chopra) (74) కన్నుమూశారు.
- By Balu J Published Date - 01:20 PM, Thu - 20 April 23

బాలీవుడ్ (Bollywood) లో విషాదం చోటుచోసుకుంది. బాలీవుడ్ దివంగత దర్శకుడు యశ్ చోప్రా సతీమణి పమేలా చోప్రా (Pamela Chopra) (74) కన్నుమూశారు (Passed away). పమేలా చోప్రా ఒక ప్రసిద్ధ భారతీయ నేపథ్య గాయని. ఆమె సొంత బ్యానర్ పై సినిమాలు నిర్మించారు. అలాగే రచయితగా కూడా పని చేశారు. పమేలా రెండు వారాల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ.. ముంబై (Mumbai)లోని లీలావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఆమె పరిస్థితి విషమించడంతో గురువారం ఆమె చనిపోయారు. అయితే ఆమె మరణంపై యశ్ రాజ్ ఫిల్మ్స్ తన అధికారిక ఇన్ స్ట్రా గ్రామ్ పోస్టులో సంతాపం వ్యక్తం చేసింది.
పమేలా చోప్రా (Pamela Chopra) చివరిసారిగా వైఆర్ఎఫ్ డాక్యుమెంటరీ ‘ది రొమాంటిక్స్’లో తన భర్త యశ్ చోప్రా, ఆయన ప్రయాణం గురించి మాట్లాడారు. ఆమె 1970 సంవత్సరంలో యశ్ చోప్రాను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు నిర్ణయించిన వివాహం. వీరికి ఆదిత్య, ఉదయ్ చోప్రా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పమేలా మరణంతో చోప్రా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read: Ram Charan: షూటింగ్స్ కు రామ్ చరణ్ బ్రేక్..? పుట్టబోయే బిడ్డ కోసమేనా!