Blockbuster Pongal Song : వెంకటేష్ లో ఇంత టాలెంట్ ఉందా..?
Blockbuster Pongal Song : భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటను హీరో విక్టరీ వెంకటేశ్తో పాటు భీమ్స్, రోహిణి సొరట్ ఆలపించారు
- Author : Sudheer
Date : 30-12-2024 - 7:25 IST
Published By : Hashtagu Telugu Desk
విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ( Sankranthiki Vasthunam) సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ తర్వాత వెంకటేశ్ – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతుండడం.. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు దీనిని నిర్మిస్తుండడంతో పాటు సినిమా ప్రమోషన్ కూడా సరికొత్తగా చేస్తుండడం..సాంగ్స్ సైతం సూపర్ హిట్ అవుతుండడం తో సినిమాకు పాజిటివ్ బజ్ పెరిగిపోతుంది.
తాజాగా సినిమాలో వెంకటేష్ పాడిన Blockbuster Pongal Full Song ను సోమవారం మేకర్స్ రిలీజ్ చేసారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటను హీరో విక్టరీ వెంకటేశ్తో పాటు భీమ్స్, రోహిణి సొరట్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. వెంకటేష్ ఈ సాంగ్ ను ఫుల్ జోష్ తో పాడడం విని అభిమానులు షాక్ అవుతున్నారు. వెంకీ మామ లో ఇంత టాలెంట్ ఉందా అంటూ ప్రశంసిస్తున్నారు. మీరు కూడా ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చెయ్యండి.
Read Also : Free Bus Travel : ఏపీలో ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!