BiggBoss Telugu : బిగ్ బాస్ కి ఉన్న ఏకైక ఆప్షన్ అతనేనా..!
BiggBoss Telugu బిగ్ బాస్ తెలుగు సీజన్ మొదలయ్యే ప్రతిసారి ఈసారి కంటెస్టెంట్స్ ఎవరెవరు అనే డిస్కషన్స్ తో పాటుగా హోస్ట్ గా ఎవరు చేస్తారన్నది కూడా చర్చల్లో
- Author : Ramesh
Date : 22-06-2024 - 11:27 IST
Published By : Hashtagu Telugu Desk
BiggBoss Telugu బిగ్ బాస్ తెలుగు సీజన్ మొదలయ్యే ప్రతిసారి ఈసారి కంటెస్టెంట్స్ ఎవరెవరు అనే డిస్కషన్స్ తో పాటుగా హోస్ట్ గా ఎవరు చేస్తారన్నది కూడా చర్చల్లో ఉంటుంది. బిగ్ బాస్ తెలుగుని ఇప్పటివరకు ముగ్గురు హీరోలు హోస్ట్ గా చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ని ఎన్.టి.ఆర్, రెండో సీజన్ ని నాని హోస్ట్ చేయగా 3వ సీజన్ నుంచి కింగ్ నాగార్జున చార్జ్ తీసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి సీజన్ 7 వరకు ఐదు సీజన్లు.. మరో ఓటీటీ మొత్తం ఆరు సీజన్లు కింగ్ నాగార్జున హోస్ట్ గా చేశారు.
ఐతే సీజన్ 8 స్టార్ట్ అవ్వబోతున్న ఈ టైం లో మరోసారి హోస్ట్ ఏమైనా మారుతున్నాడా అనే డిస్కషన్ మొదలైంది. ఐతే దీనికి వినిపిస్తున్న ఒకే ఒక్క మాట బిగ్ బాస్ కి ఉన్న ఏకైక ఆప్షన్ నాగార్జున మాత్రమే అని. ఎందుకంటే స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగార్జున ఒక్కడే అటు సినిమాలు ఇటు బిగ్ బాస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు.
అంతేకాదు బిగ్ బాస్ అనగానే నాగార్జున హోస్ట్ అనేది ఆడియన్స్ లో ఫిక్స్ అయ్యారు. హోస్ట్ గా నాగార్జున ఫస్ట్ క్లాస్ గా చేస్తున్నారు. అందుకే ఇక హోస్ట్ గా ఆయన్ను కొనసాగించడమే బెటర్ అని నిర్వాహకులు కూడా అనుకుంటున్నారట. హిందీలో బిగ్ బాస్ హోస్ట్ గా సల్మాన్ ఖాన్ ఏళ్ల తరబడి చేస్తున్నాడు. సో తెలుగులో హోస్ట్ గా నాగార్జునని పర్మినెంట్ చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి. సో బిగ్ బాస్ హోస్ట్ ఎవరు అనే ప్రశ్న మళ్లీ రిపీట్ అవ్వకపోవచ్చు.
Also Read : Vijay Devarakonda : కల్కి కోసం దేవరకొండ.. ఎంత డిమాండ్ చేశాడు..?