Bigg Boss Winner : బిగ్ బాస్ విన్నర్ కు ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది..అదేంటో తెలుసా..?
- By Sudheer Published Date - 05:39 PM, Sun - 17 December 23
నార్త్ లో సూపర్ సక్సెస్ సాధించిన బిగ్ బాస్ (Bigg Boss)..సౌత్ లో కూడా అంతే ఆదరణ దక్కించుకుంటుంది. ఇప్పటికే ఆరు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ షో..ఈరోజు తో ఏడో సీజన్ కూడా పూర్తి చేసుకోబోతుంది. ఈ సీజన్ మొదటి నుండి అలరిస్తూ టాప్ రేటింగ్ తో కొనసాగుతూ వచ్చింది. సీరియల్ బ్యాచ్ , రైతు బిడ్డ , పాట బిడ్డ , సినీ స్టార్స్ ఇలా అంత కూడా సందడి చేసారు.
ఇక బిగ్ బాస్ సైతం గత సీజన్ తప్పులు జరగకుండా మొదటి నుండి చక్కటి ప్లాన్ తో ముందుకు తీసుకెళ్లారు. టెన్షన్ పెట్టె నామినేషన్స్ , రసవత్తరగా సాగే గేమ్స్ , మధ్య మధ్యలో సీరియల్ భామల అందాల ఆరబోత ఇలా అందరికి సమపాలనలో న్యాయం చేస్తూ షో సక్సెస్ అయ్యింది. మొదటి వారంలో 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపిన బిగ్ బాస్.. ఫైనల్ వీక్ కు ఆరుగుర్ని హౌస్ లో ఉంచాడు. ఈరోజు ఈ ఆరుగురిలో ఒక్కరు మాత్రం విన్నర్ అవుతాడు. ప్రస్తుతం ఆ విన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది. కామన్ మాన్ గా హౌస్ లో అడుగుపెట్టిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఈరోజు టైటిల్ విన్నర్ గా బయటకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటె బిగ్ బాస్ విన్నర్ అయ్యినవారు పెద్దగా స్టార్ లు కాలేకపోయారని అంత మాట్లాడుకుంటుంటారు. దీనికి ఉదాహరణలు కూడా చెపుతుంటారు.
ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తికాగా..ఈ ఆరు సీజన్ లలో విన్నర్ అయ్యిన వారు పెద్దగా స్టార్ గుర్తింపు తెచ్చుకోలేకపోయారు..కొంతమందైతే అసలు అడ్రెస్ లేకుండా పోయారని చెపుతున్నారు. సీజన్ వన్ విజేతగా నిలిచింది యాక్టర్ శివ బాలాజీ..అంతకుముందే సినిమాల్లో గుర్తింపు ఉండడంతో..విన్నర్ అయ్యాడు. గెలిచిన తర్వాత కూడా ఒక రెండు మూడు చానల్స్ లో కాస్త ఇంటర్వ్యూలు ..ఒక వారం హడావిడి అంతే.. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. ప్రస్తుతం అతను పెద్దగా సినిమాలు కూడా చేయడం లేదు.
We’re now on WhatsApp. Click to Join.
సీజన్ 2 కు కౌశల్ మందా విన్నర్ అయ్యాడు. కప్ గెలుచుకొని బయటకు వచ్చాక..కొత్త షాప్ ఓపెనింగ్స్.. రిబ్బన్ కటింగ్స్.. టీవీ ఇంటర్వ్యూస్.. ఇలా కొన్ని రోజులు హడావిడి తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత పెద్దగా కౌశల్ గురించి ప్రస్తావన లేకుండా అయిపోయింది.
సీజన్ 3 కి రాహుల్ సిప్లిగంజ్ విజేత అయ్యాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి ఫేమస్ అయ్యాడు. ఆస్కార్ వేదికపై పాట పాడి వరల్డ్ వైడ్ రికార్డు లోకి ఎక్కాడు. ఒకరకంగా ఇప్పటివరకు విజేతలగా నిలిచిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో బాగా లాభపడింది ఈ పాత బస్తీ కుర్రాడే.
సీజన్ 4 విజేత అభిజిత్. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీ తో కాస్త పేరు వచ్చింది. బిగ్ బాస్ విజేత అయిన తర్వాత మంచిగా అవకాశాలు కలిసి వస్తాయి అనుకున్నాడు కానీ ఊహించిన స్థాయిలో మాత్రం బిగ్ బాస్ నుంచి అతనికి ఫేమ్ దక్కలేదు. బిగ్ బాస్ తర్వాత అసలు కనిపించిందే లేదు.
సీజన్ 5 కి సన్నీ విజేత అయ్యాడు..బిగ్ బాస్ కు వెళ్ళాక ముందు సీరియల్స్ లలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఆ ఫేమ్ తో పాటు హౌస్ లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకొని వార్తల్లో నిలిచాడు. బిగ్ బాస్ విజేత అయినా తర్వాత సినిమా ఛాన్సులు గట్టిగా వస్తాయని అనుకున్నాడు కానీ పెద్దగా ఏమి రావడం లేదు.
సీజన్ 6 లో విజేతగా సింగర్ రేవంత్ అయ్యాడు. ఈ షోలో పాల్గొనడానికి అంటే ముందు కూడా సింగర్ గా అతనికి మంచి గుర్తింపు ఉంది.. పైగా ఇండియన్ ఐడల్ 9 విజేతగా కూడా. ఇక బాహుబలి మనోహరి పాట తర్వాత ఇతనికి మరింత ఫేమ్ వచ్చింది. బిగ్ బాస్ లో ఎంటర్ కాకముందే గట్టి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అతనికి ఈ షో గెలవడం వల్ల ప్రత్యేకంగా వచ్చిన గుర్తింపు అయితే ఏమీ లేదు.
ఇక ఇప్పుడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేత అయ్యాడు. మరి ఈయనకు బిగ్ బాస్ ఎంత కలిసి వస్తుందో చూడాలి..మరి సినిమా ఛాన్సులు ఏమైనా వస్తాయా..? స్టార్ ను చేస్తాయా అనేది చూడాలి. ఒకవేళ ప్రశాంత్ కు సినిమా ఛాన్సులు వచ్చి స్టార్ ను చేస్తే..బిగ్ బాస్ సెంటిమెంట్ కు బ్రేక్ పడినట్లే.
Read Also : Hibiscus Tea: చలికాలంలో మందారం టీ తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే?
Related News
Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?
తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చి