Bigg Boss 6: రేవంత్ ని టార్గెట్ చేసిన గీతూ.. భలే ఇరికించేసిందిగా?
- By Nakshatra Published Date - 03:34 PM, Thu - 27 October 22
తాజాగా బిగ్ బాస్ హౌస్ లో చేపల చెరువు టాస్క్ ముగిసింది. కాగా ఈ చేపల చెరువు టాస్క్ లో భాగంగా మొత్తం గీతూ హవా నడిచింది అని చెప్పవచ్చు. గీతు మాటలకి రేవంత్ అయితే సహనం కోల్పోయి గొడవకు కూడా వెళ్ళాడు. కాగా చేపల చెరువు టాస్క్ లో భాగంగా హౌస్మేట్స్ ని పర్యవేక్షించమని సంచలక్ గా గలాట గీతూ ఆదిరెడ్డిని నియమించాడు బిగ్ బాస్. గీతూ హౌస్ మేట్స్ తో పాటు గేమ్ ఆడుతూ చేపలను ఏరుకుంది. అందుకు కంటెస్టెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వెంటనే గీతూ నేను సంచాలక్ ని వాదిస్తే డిస్క్ క్వాలిఫై చేస్తాను అంటూ కంటెస్టెంట్ ని బెదిరించే విధంగా మాట్లాడింది. అందరూ మౌనంగా ఉన్నప్పటికీ రేవంత్ మాత్రం గీతూ పై మాటల దాడికి దిగాడు.
దాంతో గీతూ, రేవంత్ ని టార్గెట్ చేసింది. టాస్క్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ లోకి మైక్ ధరించి దిగడంతో రేవంత్ కి నుంచి పది చేపలని గీతూ జరిమానా విధించింది. ఈ క్రమంలోనే గీతూ, రేవంత్ ల మధ్య మాటలు యుద్ధం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ లో నుంచి పైమా ఫస్ట్ గోల్డ్ కాయిన్ సేకరించడంతో ఆమె జంటతో పాటుగా మరొక మూడు జంటల్ని ఆ చాలెంజ్ కి ఎంపిక చేసుకునే అవకాశం దక్కింది. దాంతో మూడు జంటలను సెలెక్ట్ చేసుకున్న ఫైమా సంచాలక్ గా రేవంత్ ని ఎంచుకుంది. ఇక చాలెంజ్ ఏమిటంటే జంటలో ఒకరు అక్కడ ఉన్న అక్వేరియంలో నీళ్లు నింపుతూ ఉంటారు.
మిగిలిన జంటలోని సభ్యులు షీల్డ్ సహాయంతో ఆ నీరు పోయకుండా ఆపాలి. ఇక ఈ చాలెంజ్ లో సూర్య వాసంతి ఇలా జంట గెలిచింది.. ఆ తరువాత గీతూ ఆదిరెడ్డి కలసి కంటెస్టెంట్ల దగ్గర చేపలను లెక్కపెట్టగా 129 చేపలతో రేవంత్ ఇనయ టాప్ లో నిలిచారు. ఇక వారిద్దరిలో ఒకరు కెప్టెన్ అవుతారు అందరు ఊహించగా కానీ ఈ టాస్క్ లో భాగంగా ఒక నల్ల చేప వచ్చిందని బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. చేప ఎవరి వద్ద ఉంటుందో ఆ వ్యక్తికి రెండు జంటల ను స్వాప్ చేసే పవర్ ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పడంతో ఆ నల్ల చేప గీతూ దగ్గర ఉంటుంది. అప్పుడు నవ్వుతూ గీతూ రేవంత్, ఇనయ – శ్రీహన్ శ్రీ సత్య జంటలను స్వాప్ చేస్తున్నట్లు ప్రకటించడంతో వెంటనే ఇనయ రేవంత్ ఇద్దరు రెచ్చిపోయారు. రేవంత్ తన నోటికి పని చెప్పాడు. అలా కొద్దిసేపు గలాటా గీతూ రేవంత్ ల మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఇక చేపల టాస్క్ లో భాగంగా ఆదిత్య మెరీనా జంటను బిగ్ బాస్ టాస్క్ నుంచి తప్పిస్తున్నట్లు తెలిపాడు. కానీ చివర్లో బిగ్ బాస్ ఇంతటితో ఈ టాస్క్ ముగిసింది అంటూ గీతూ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.
Related News
Harika Narayan: ఘనంగా సింగర్ హారికా నారాయణ్ పెళ్లి.. నెట్టింట ఫొటోస్ వైరల్!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరీ తర్వాత ఒకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అందులో భాగంగానే ఇటీవలే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీతో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. అలాగే తీన్మార్ సినిమా హీరోయిన్ కూడా తన ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ పెళ్లి ఆదివారం ఘనంగా జరిగింది. హారిక నారాయణ్ ప్రి�