Bigg Boss Telugu 9 Contestants : బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్లు వీరేనా?
Bigg Boss Telugu 9 Contestants : ఈ నేపథ్యంలో హౌజ్‌లోకి ఎవరెవరు ఎంట్రీ (Bigg Boss Telugu 9 Contestants) ఇవ్వబోతున్నారు అన్న విషయంపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది
- By Sudheer Published Date - 10:07 AM, Sun - 13 July 25

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులచే అత్యధికంగా ఆదరించబడే రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ (Bigg Boss Telugu 9) తెలుగు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఈ షో, సీజన్ 9 కోసం కూడా ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌజ్‌లోకి ఎవరెవరు ఎంట్రీ (Bigg Boss Telugu 9 Contestants) ఇవ్వబోతున్నారు అన్న విషయంపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే పలు బుల్లితెర సెలబ్రిటీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.
CM Revanth Reddy: అందుకే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం: CM రేవంత్
ఈసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వారిలో సుమంత్ అశ్విన్, జ్యోతి రాయ్, కల్పికా గణేష్, తేజస్విని గౌడ్, శ్రావణి శర్మ, ఆర్జే రాజ్, సాయి కిరణ్, ఈకనాథ్, దీపికా, దెబ్జానీ వంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. అలేఖ్య సిస్టర్స్‌లో ఒకరు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే బుల్లితెరపై మంచి గుర్తింపు పొందిన నవ్య స్వామి ఎంపికైందని కూడా బజ్ వినిపిస్తోంది. కానీ ఈ జాబితాపై ఇంకా అధికారిక ప్రకటనా రాలేదు. నిర్వాహకులు పూర్తిస్థాయిలో గోప్యత పాటిస్తూ, ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ను సెప్టెంబర్ 7, 2025న గ్రాండ్ లాంచ్ చేయనున్నారు. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ప్రత్యేకతగా ఈసారి హౌజ్‌లోకి సెలబ్రిటీలతో పాటు ఇద్దరు సామాన్యులు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇది షోకు మరో అద్భుత ఆకర్షణగా మారే అవకాశం ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 ఎలాంటి ఎంటర్టైన్మెంట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో చూడాల్సిందే.