Bigg Boss 6: వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మార్పులు..అతను హ్యాండ్ ఇవ్వడంతో మరొకరి కోసం వేట?
తెలుగులో ఇటీవలే గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 6 గత సీజన్లతో పోల్చుకుంటే రేటింగ్ విషయంలో చాలా
- By Nakshatra Published Date - 03:48 PM, Tue - 25 October 22
తెలుగులో ఇటీవలే గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 6 గత సీజన్లతో పోల్చుకుంటే రేటింగ్ విషయంలో చాలా వెనకబడిపోయింది. అయితే బిగ్ బాస్ షో రేటింగ్స్ ని పెంచడం కోసం షో నిర్వాహకులు ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ బిగ్ బాస్ షోకి ఆదరణ మాత్రం అనుకున్న విధంగా దక్కడం లేదు. ప్రతివారం రేటింగ్స్ పెరుగుతాయి అని షో నిర్వహకులు భావిస్తున్నప్పటికీ ప్రతి వారం కూడా షో నిర్వాహకులను రేటింగ్స్ అసంతృప్తి పరుస్తూనే ఉన్నాయి.
అయితే రేటింగ్స్ ని పెంచుకోవడం కోసం బిగ్ బాస్ షో నిర్వాహకులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన ప్రేక్షక ఆధారణ మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ షో నిర్వాహకులు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే వైల్డ్ కార్డు ఎంట్రీ. అంతంత మాత్రమే వస్తున్న రేటింగ్స్ ను పెంచుకోవడం కోసం హౌస్ లోకి ఒక మంచి కమెడియన్ ను పంపిస్తే రేటింగ్స్ తప్పకుండా పెరుగుతాయని షో నిర్వహించారు. ప్రస్తుతం అదే పనిలో బిగ్ బాస్ బిజీగా ఉన్నట్లు అనిపిస్తుంది. గత రెండు మూడు వారాల నుంచి కొనసాగుతున్న ఎలిమినేషన్స్ అయితే న్యాయంగానే జరిగినట్లు అనిపిస్తుంది.
అయితే ఈ క్రమంలోనె వైల్డ్ కార్డు ద్వారా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ ను తీసుకురావాలని అనుకున్నారట. అయితే మొదట్లో ఆఫర్ కి ఒప్పుకున్న సుధీర్ చివరి నిమిషంలో ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్లో ఎవరో ఒకరు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తుంటారు. గతంలో ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసారి ఇంత ఖర్చు అయినా పర్వాలేదు సుడిగాలి సుదీర్ హౌస్ లోకి తీసుకురావాలి అని బిగ్ బాస్ షో నిర్వాహకులు భావించారు. కానీ సుడిగాలి సుధీర్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రస్తుతం మరొక జబర్దస్త్ కమెడియన్ ను హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇప్పించే పనిలో ఉన్నారు షో నిర్వాహకులు. మరి వైల్డ్ కార్డు ద్వారా ఏ కమెడియన్ ఎంట్రీ ఇస్తాడో చూడాలి మరి.
Related News
Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?
తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చి