Bigg Boss 6: శ్రీసత్యకు ఊహించని షాక్.. ఆమెను డిస్ క్వాలిఫై చేసిన బిగ్ బాస్?
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 తాజాగా11వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ
- By Nakshatra Published Date - 02:26 PM, Tue - 15 November 22
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 తాజాగా 11వ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్పుడే హౌస్ లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్స్ తో తాజాగా హౌస్ ఒక్కసారిగా హీటెక్కిపోయింది. నామినేషన్స్ లో భాగంగా ప్రతి ఒక్క కంటెంట్ ఇద్దరు కంటెస్టెంట్ ల తలపై చెత్తను వేసి ఎందుకు నామినేట్ చేయాలి అనుకుంటున్నారు రీజన్ చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఫైమా కెప్టెన్ కావడంతో ఆమెకు నామినేషన్స్ నుంచి మినహాయింపు దక్కింది. దాంతో ఫైమాని ఎవరు నామినేట్ చేయకూడదు అని బిగ్ బాస్ ఆదేశించాడు.
ఈ క్రమంలోని తాజాగా నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరు ఇమ్యూనిటీతో బయటపడే ఛాన్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఇచ్చాడు. ఇందుకోసం కంటెస్టెంట్లు వారికి ఇచ్చిన చెక్స్ పై అమౌంట్ రాయాలి. వారు రాసిన అమౌంట్ పై బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ప్రైజ్ మనీ నుండి తగ్గించబడుతుంది అని తెలిపాడు బిగ్ బాస్. నామినేషన్స్ లో భాగంగా నామినేట్ అయిన తొమ్మిది మందిలో ఎక్కువ అమౌంట్ రాసిన ఇంటి సభ్యుడికి ఇమ్యూనిటీ లభిస్తుంది. అంటే నామినేషన్స్ నుంచి బయటపడతారు అని అర్థం. ఈ నామినేషన్స్ లో భాగంగానే రేవంత్,ఆదిరెడ్డి ఇద్దరు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఈ కారణంతోనే వారు చాలా తక్కువ అమౌంట్ రాసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆదిరెడ్డి ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ అమౌంట్ రాసిన కంటెస్టెంట్లు అసలు ప్లేయర్ లే కాదు అని అనేశాడు. కాగా ఈ గేమ్ నుండి శ్రీ సత్యను బిగ్ బాస్ డిస్క్ క్వాలి ఫై చేశాడు. ఇంటి సభ్యులు చెక్ పై రాసే అమౌంట్ ఇతరులకు చెప్పకూడదు చర్చించకూడదు అని ముందే క్లియర్ గా చెప్పినప్పటికీ శ్రీ సత్య చర్చించడంతో ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు బిగ్ బాస్. దీంతో ఈ గేమ్ లో పాల్గొని ఇమ్యూనిటీ పొందే ఛాన్స్ శ్రీ సత్య కోల్పోయింది.
Related News
Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య సీన్స్ డిలీట్ చేసారా?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది. ఇకపోతే తాజాగా విడుదల అయిన టిల్లు స్క్వేర్ మూవీలో అను�