Bigg Boss 6: దిగజారిపోయిన శ్రీహాన్.. కీర్తిని వెక్కిరిస్తూ వెకిలి చేష్టలతో అలా?
బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి శ్రీహాన్ ప్రవర్తన పూర్తిగా మారిపోతోంది. పిచ్చి పట్టిన వాళ్ళ ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడు
- By Nakshatra Published Date - 02:53 PM, Thu - 17 November 22
బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి శ్రీహాన్ ప్రవర్తన పూర్తిగా మారిపోతోంది. పిచ్చి పట్టిన వాళ్ళ ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడు శ్రీహాన్. ఇలాగే కంటిన్యూ అయితే టాప్ ఫైవ్ లో నుంచి కాదు కదా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు భారీగా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో అయితే అంతకంతకు దిగజారిపోతున్నాడు. శ్రీ సత్య వెనకాలే తిరుగుతూ హగ్గులు ఇవ్వడం శ్రీ సత్య తానా అంటే తందానా అనడం. స్విమ్మింగ్ పూల్ లో దగ్గర కూర్చుని హౌస్ లో ఉన్న వాళ్ల గురించి శ్రీ సత్య శ్రీహాన్ కలిసి చెవులు కొరుక్కోవడం ఇవి తప్పితే శ్రీహన్ పెద్దగా గేమ్ లో కూడా పెద్దగా గెలిచింది లేదు వాడింది లేదు.
అయితే బయట శ్రీహానికి భారీగానే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి బతికి బయటపడుతున్నాడు కానీ లేదంటే ఈపాటికి ఎప్పుడో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమెంట్ అయి బయటకు వెళ్లిపోయేవాడు. ఇది ఇలా ఉంటే తాజాగా బీబీ ట్రాన్స్పోర్ట్ టాస్క్ లో భాగంగా మరొకసారి కీర్తిని టార్గెట్ చేసిన శ్రీహాన్ ఆమెను కెప్టెన్సీకి అనర్హురాలిగా ప్రకటిస్తూ ఏవేవో రిజల్ట్స్ చెప్పాడు. ధర్మకోల్ టాస్క్ గురించి మాట్లాడుతూ దానికి సంచాలకుగా చేసిన రేవంత్ పరమ వరస్ట్ అయితే దాంట్లో కీర్తి కూడా సరిగా ఆడలేదు అంటూ నోరు పారేసుకున్నాడు. నేపథ్యంలోనే శ్రీ సత్య కౌంటర్లకు సమాధానం చెప్పలేక వెకిలి చేష్టలు చేశాడు శ్రీహాన్. కీర్తి మాత్రం ఏమీ అనకుండా నార్మల్ గానే యాక్సెప్ట్ చేసింది.
అయితే తిరిగి శ్రీహాన్ ని ఆమె అనర్హుడిగా ప్రకటించేసరికి అతనిలో ఉన్న వెకిలి స్టార్ బయటికి రావడం మాత్రమే కాకుండా కావాలనే పొలమారినట్లు దగ్గుతూ వెకిలి నవ్వులతో అతని వంకర బుద్ధి చూపించాడు. నన్ను ఫెయిల్ అని ఎలా అంటావు నాగార్జున చెప్పారని నువ్వు అంటున్నావు నీ జీవితం మొత్తం రిటర్న్ నామినేషన్ తప్ప ఏమీ ఉండదు అంటూ మరొకసారి నోరు జారాడు శ్రీహాన్. అప్పుడు వెంటనే కీర్తి ఏమన్నావ్ నా జీవితం మొత్తమా అంటే నా జీవితం నీకు తెలుసు నా జీవితం.. మొత్తం నువ్వు ఏం చూసావు అని అడగగా వెంటనే శ్రీ సత్య వెకిలి నవ్వు స్టార్ట్ చేసింది. అప్పుడు శ్రీహన్ కూడా నవ్వుతూ కీర్తిని పిచ్చిదాన్ని చూసినట్టు చూసాడు. ఆ తర్వాత కీర్తి కుక్కల గురించి చెప్పిన సామెతలను ప్రస్తావిస్తూ నువ్వు నన్ను అన్నావో సత్యని కాదు హౌస్ మేట్స్ ని కుక్కలతో పోల్చే రైట్ ఎవరికీ లేదు అని అన్నాడు. మొత్తానికి శ్రీహాన్ తన మాటలతో పిచ్చివాడిలా ప్రవర్తించడం మాత్రమే కాకుండా దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. ఇలాగే కంటిన్యూ అయితే ఈ వారం మెరీనా శ్రీ సత్యలకు బదులుగా శ్రీహాన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Related News
Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య సీన్స్ డిలీట్ చేసారా?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. గతంలో విడుదల అయిన డీజే టిల్లు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది. ఇకపోతే తాజాగా విడుదల అయిన టిల్లు స్క్వేర్ మూవీలో అను�