Bigg Boss Priyanka Jain : బిగ్ బాస్ హౌస్ లో ఇంజక్షన్లు వాడా.. టాబ్లెట్స్ కూడా.. అతని మాస్క్ ఇప్పటికీ తీయలేదు..!
Bigg Boss Priyanka Jain బిగ్ బాస్ పూర్తైన ఇన్నాళ్లకు సీజన్ 7 లో విషయాలను మరింత క్లియర్ గా ఆడియన్స్ తో పంచుకున్నారు ప్రియాంక జైన్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఆమె టాప్ 5 దాకా
- Author : Ramesh
Date : 02-02-2024 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
Bigg Boss Priyanka Jain బిగ్ బాస్ పూర్తైన ఇన్నాళ్లకు సీజన్ 7 లో విషయాలను మరింత క్లియర్ గా ఆడియన్స్ తో పంచుకున్నారు ప్రియాంక జైన్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఆమె టాప్ 5 దాకా వెళ్లారు. సీజన్ 7 లేడీ కంటెస్టెంట్స్ లో ఆమె ఒక్కరే టాప్ 5 దాకా వెళ్లారు. మొదటి నుంచి ఆమె ఆట తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇక స్టార్ మా బ్యాచ్ అంటూ అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి మీద శివాజి ఎటాక్ తెలిసిందే. అయినా సరే తట్టుకుని చివరి వరకు నిలబడ్డారు.
తను బయట ఎలా ఉన్నానో హౌస్ లో కూడా అలానే ఉన్నానని అన్నారు ప్రియాంక. అందరి కన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టా.. అసలు నేనే విన్నర్ అవ్వాలని ఆమె అంటున్నారు. ఎడిటింగ్ లో కొన్ని తాను తప్పు చేసినట్టుగా చూపించారు. అలా ఎందుకు వేశారో అర్ధం కాలేదని అన్నారు.
హౌస్ లో కొంతమంది స్ట్రాటజీ ప్లే చేస్తూ ఆత ఆడారు. వాళ్లలా తాను కూడా అలా చేసి ఉంటే టాప్ లో ఉండేదాన్ని అని అన్నారు. శివాజి గారు నాపై నిద్రలు వేశారు. అబద్ధాలు చెబుతానని అనారు. అలా అనడం కరెక్ట్ కాదు ఆయనకు దగ్గర అవ్వాలని ట్రై చేసినా ఆయన దూరం పెట్టారని అన్నారు.
ఆయన కచ్చితంగా మాస్క్ తో ఉన్నారు. జెన్యూన్ గా మాత్రం లేరు. మాస్టర్ మైండ్ తో ఆలోచించి ఆడే వారు. శివాజి గారి ఒరిజినాలిటీ ఎవరికీ తెలియదు కానీ హౌస్ లో నాకు అర్ధమైందని అన్నారు. బిగ్ బాస్ హౌస్ లో కొందరిని చూశాక 100 రోజులు కాదు జీవితాంతం నటించవచ్చని తెలిసిందని ప్రియాంక జైన్ అన్నారు. తనకు ఆరోగ్యం బాగాలేక ఇంజక్షన్స్, టాబ్లెట్స్ వాడాను అవేవి షోలో చూపించలేదని ఆమె అన్నారు.