Bigg Boss OTT Second Season : బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్.. కంటెస్టెంట్స్ కాదు హోస్ట్ కూడా డౌటే..!
Bigg Boss OTT Second Season బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ అవ్వడంతో వెంటనే బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకండ్ సీజన్ అదే ఓటీటీ 2 సీజన్ మొదలు పెట్టాలని ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీం
- Author : Ramesh
Date : 26-01-2024 - 5:53 IST
Published By : Hashtagu Telugu Desk
Bigg Boss OTT Second Season బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ అవ్వడంతో వెంటనే బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకండ్ సీజన్ అదే ఓటీటీ 2 సీజన్ మొదలు పెట్టాలని ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీం. ఆల్రెడీ అంతకుముందు సీజన్లకు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ తో పాటుగా సీజన్ 7 లో కొందరిని ఓటీటీ సీజన్ కి సెలెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కంటెన్స్టెంట్స్ ఓటీటీ సీజన్ మీద అంత ఆసక్తిగా లేదని టాక్.
We’re now on WhatsApp : Click to Join
సీజన్ 7లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా కొంత టైం కావాలని అంటున్నారట. అందుకే ఫిబ్రవరి, మార్చి లో అసలైతే బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సెకండ్ సీజన్ మొదలు పెట్టాలని అనుకున్న బిగ్ బాస్ వారి ప్లాన్స్ వర్క్ అవుట్ అవ్వలేదు.
బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ లో సీజన్ 7 కి సంబంధించిన యావర్, నయని పావని, భోలే శావలి ఉంటారని అన్నారు. అంతేకాదు వీరితో పాటూఅ ఈసారి ఓటీటీ సీజన్ కి కూడా సెలబ్రిటీస్ ని హౌజ్ మెట్స్ గా తీసుకు రావాలని అనుకున్నారు. కానీ ఓటీటీ అయ్యేసరికి ఎవరు అంతగా ఆసక్తి చూపించట్లేదని తెలుస్తుంది.
బిగ్ బాస్ అంతకుముందు సీజన్లు ఏమో కానీ సీజన్ 7 ఎక్కువగా డిస్నీ హాట్ స్టార్ లో చూసిన వారే ఉన్నారు. అందులో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంది. సో బిగ్ బాస్ నాన్ స్టాప్ సెకండ్ సీజన్ పై బిగ్ బాస్ టీం ప్లాన్ వేరేలా ఉంది. ఇదేకాకుండా హోస్ట్ విషయంలో కూడా బిగ్ బాస్ టీం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. హోస్ట్ గా నాగార్జున కష్టమే అని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
Also Read : Ranbir Kapoor Animal OTT Version : యానిమల్ ఓటీటీ వెర్షన్.. వాళ్లని అసంతృప్తి పరచిన సందీప్ వంగ..!