Bigg Boss : కుండ బద్దలు కొడుతూ..హౌస్ సభ్యుల ఫై నాగ్ సీరియస్
భోలే ..శోభను.. నీకు ఎర్రగడ్డనే దిక్కు అని అన్న విషయం పై కూడా నాగార్జున క్లాస్ పీకారు. ఆ తర్వాత భోలే విషయంలో ప్రియాంక ప్రవర్తించిన తీరు పై మాట్లాడుతూ ‘ఒకసారి నోరు జారితే తర్వాత సారీ చెప్పిన ప్రయోజనం లేదు అంటూ ప్రియాంకకు కూడా క్లాస్ ఇచ్చారు.
- Author : Sudheer
Date : 21-10-2023 - 6:01 IST
Published By : Hashtagu Telugu Desk
బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7)రోజు రోజుకు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. హౌస్ లో ఈరోజు ఏంజరుగుతుందో..హౌస్ సభ్యులు ( Bigg Boss Contestants) ఎలా గొడవలు పడతారో..ఎలా నవ్విస్తారో..బిగ్ బాస్ ఎలాంటి గేమ్స్ ఆడిస్తాడో అంటూ ఆతృతగా ఎదురుచూస్తుంటుంటారు. ఇక శనివారం (Saturday) వచ్చిందంటే చాలు..వారం పాటు హౌస్ లో సభ్యులు ఏంచేసారో..ఎలాంటి తప్పులు చేసారు..వాటికీ నాగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తుంటారు.
ఈరోజు టెలికాస్ట్ అయ్యే షో తాలూకా ప్రోమో (Bigg Boss Saturday Promo) ను రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీం. ఈ ప్రోమోలో నాగార్జున గత వారంలో హౌస్ మేట్స్ చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ వాళ్లపై సీరియస్ అయ్యాడు. నామినేషన్స్ లో ప్రశాంత్, సందీప్ ఇద్దరి మధ్య జరిగిన ‘ఊరోడా’ గొడవ గురించి మాట్లాడుతూ.. ప్రశాంత్ ఆరోజు సందీప్ నిన్ను ఊరోడా అనలేదని ఒట్టు వేశాడు మరి నువ్వెందుకు వేయలేదు.. అందుకే ఒకరి పై నింద వేసేటప్పుడు అది నిజామా, కాదా అని తెలుసుకో. అయినా ఊరోడా అనేది తప్పా.. ఇక్కడ అందరు ఊరు నుంచి వచ్చిన వాళ్ళే, అందరికి అన్నం పెట్టేది ఆ ఊరే, మా నాన్న ఊరోడు అని నేను గర్వంగా చెప్తాను అంటూ ప్రశాంత్ పై నాగార్జున సీరియస్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే భోలే ..శోభను.. నీకు ఎర్రగడ్డనే దిక్కు అని అన్న విషయం పై కూడా నాగార్జున క్లాస్ పీకారు. ఆ తర్వాత భోలే విషయంలో ప్రియాంక ప్రవర్తించిన తీరు పై మాట్లాడుతూ ‘ఒకసారి నోరు జారితే తర్వాత సారీ చెప్పిన ప్రయోజనం లేదు అంటూ ప్రియాంకకు కూడా క్లాస్ ఇచ్చారు. శోభ, తేజ కోసం పంపిన కేక్ అమర్ తినడం ఫై నీకు చాలా నష్టం జరగబోతుంది అంటూ అమర్ కు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. ఇక ఈరోజు ప్రోమోలో నాగార్జున అందరి తప్పులను కుండ బద్దలుకొట్టి చెప్పాడు. మరి ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో చూడాలి.
Read Also : Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, మహిళల కోసం 5675 కొత్త బస్సులు